ఇటీవల విడుదలైన ‘తాండవ్’ అనే వెబ్ సిరీస్.. పెద్ద వివాదాలకు తెరలేపిన సంగతి తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ పొలిటికల్ థిల్లర్ వెబ్ సీరిస్ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని ఆరోపిస్తూ ఆ వెబ్ సిరీస్ దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ అలాగే నటీనటులు, సాంకేతిక నిపుణులందరి పై కేసు నమోదయ్యింది. అంతేకాదు అమెజాన్ ప్రైమ్ నుండీ ఆ వెబ్ సీరిస్ ను తక్షణమే తొలగించాలని కూడా ఆ ఫిర్యాదులో ఉంది.
అయినప్పటికీ ఆ వెబ్ సిరీస్ ను తొలిగించలేదు అమెజాన్ వారు. దీంతో ఈ వివాదం ఇంకా సర్దుమణగలేదు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ‘మిర్జాపూర్’ సీజన్ 2 పై కూడా కేసు నమోదవ్వడం పెద్ద చర్చకు దారితీసింది. వివరాల్లోకి వెళితే.. ‘మీర్జాపూర్ సీజన్ 2’ లో కొన్ని సన్నివేశాలు అసభ్యకరంగాను, అభ్యంతరకరంగాను ఉన్నాయని.. అక్రమ సంబంధాలతోనే ఈ వెబ్ సీరిస్ సాగుతోందని ఆరోపిస్తూ.. అరవింద్ చతుర్వేది అనే వ్యక్తి మిర్జాపూర్ కొత్వాలీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసాడు.
అరవింద్ ఫిర్యాదుని స్వీకరించిన ఎస్పీ అజయ్ కుమార్.. దాని ఆధారంగా ‘మిర్జాపూర్ సీజన్ 2′ వెబ్ సీరిస్ నిర్మాతలైన రితేష్ సిద్వానీ, ఫర్హాన్ అక్తర్, భౌమిక్ గొండాలియా పై ఐపీసీ సెక్షన్స్ 295 ఎ, 504, 505 కింద కేసు నమోదు చేసినట్టు చెప్పుకొచ్చాడు.’మీర్జాపూర్’ మొదటి సీజన్ పై కూడా ఇలాంటి కేసు నమోదయ్యింది. దాంతో ఆ సీజన్ ను మరింత ఎక్కువ మంది వీక్షించారు. ఈసారి కూడా అదే జరుగుతుందేమో చూడాలి..!
Most Recommended Video
మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!