టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ తల్లి పై కేసు నమోదవ్వడం చర్చనీయాంశం అయ్యింది.విషయంలోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లాకి చెందిన జగ్గంపేట మండలంలోని రామవరం వద్ద పుష్కర కాల్వ ధ్వంసమైంది. దీంతో రవితేజ తల్లి భూపతి రాజ్యలక్ష్మి మరియు మర్రిపాకకు చెందిన సంజయ్ ల పై పోలీసు కేసు నమోదు అయ్యింది. సర్వే నంబర్ 108, 124లో పుష్కర కాల్వని అక్రమంగా కూల్చివేసిన కారణంగా అలాగే తూము నిర్మాణ పనుల పై పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం.
ఈ విషయం పై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ మధ్య కాలంలో ఏదో ఓక వివాదంతో రవితేజ వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. అయినదానికి కాని దానికి తనని అనవసరంగా మీడియాలోకి లాగి పెంట పెంట చేస్తున్నారని మొన్నామధ్య బాలయ్య ‘అన్ స్టాపబుల్’ టాక్ షోలో రవితేజ చెప్పుకొచ్చిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇదిలా ఉండగా… సినిమాలు విషయానికి వస్తే… గతేడాది సంక్రాంతికి ‘క్రాక్’ తో బ్లాక్ బస్టర్ కొట్టిన రవితేజ ప్రస్తుతం ‘ఖిలాడి’ షూటింగ్ ను కంప్లీట్ చేసే పనిలో పడ్డాడు.
రమేష్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. దీంతో పాటు శరత్ మండవ దర్శకత్వంలో రామారావు ఆన్ డ్యూటీ, త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో ‘ధమాకా’, సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘రావణాసుర’, వంశీ కృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో ‘టైగర్ నాగేశ్వర రావు’ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు.