తన స్నేహితుడైన వైసీపీ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డి కోసం అల్లు అర్జున్ (Allu Arjun) ప్రత్యేకంగా అతని ఇంటికి వెళ్లడం జరిగింది. తన భార్య స్నేహ రెడ్డిని తీసుకుని మరీ అల్లు అర్జున్ శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో అతని తరఫున ప్రచారం కూడా చేశారు. ‘నాకు రవిచంద్రా రెడ్డి చాలా కాలంగా తెలుసు. గతంలో మేము తరచూ కలుస్తూ ఉండేవాళ్ళం. కానీ ఎమ్మెల్యే తను 6 నెలలకు ఒక్కసారి మాత్రమే కలుస్తున్నాడు.
ఏదేమైనా.. కష్టపడి పని చేస్తున్నాడు. ఇదే దానికి నిదర్శనం. నా స్నేహితుడిని గెలిపించాలని అందరినీ కోరుకుంటున్నాను’ అంటూ అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు. అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు అల్లు అర్జున్ అలాగే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రా రెడ్డి పై పోలీస్ కేసు నమోదవ్వడం సంచలనంగా మారింది. అల్లు అర్జున్ ఫ్యామిలీ రాకతో శిల్పా రవిచంద్రారెడ్డి నివాసానికి భారీగా జనాలు తరలివచ్చారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.
అయితే పోలీసుల అనుమతి తీసుకోకుండా ఇలా జన సమీకరణ చేయడం పై .. ఆ నియోజకవర్గానికి చెందిన రిటర్నింగ్ ఆఫీసర్ అల్లు అర్జున్,శిల్పా రవిచంద్రా రెడ్డి పై కంప్లైంట్ చేయడం జరిగింది. అందుకే ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం ఈ టాపిక్ కూడా వైరల్ అవుతుంది. మే 13 న ఎన్నికలు జరగడం.. మే 10 తో ప్రచార కార్యక్రమాలు నిలిపేయాలని ఆదేశాలు ఉండటం వల్ల ఇలాంటి వ్యతిరేకత ఏర్పడినట్టు స్పష్టమవుతుంది.