Pushpa: అప్పుడు జగదీశ్, ఇప్పుడు పుష్ప రాజ్ అన్న.. వరుసగా ‘పుష్ప’ నటులపై చీటింగ్ కేసులు?

  • November 26, 2024 / 02:43 PM IST

ప్రముఖ టాలీవుడ్ నటుడు శ్రీతేజ్‌ (Sritej) అందరికీ సుపరిచితమే.రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) తెరకెక్కించిన ‘వంగవీటి’ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలతో బాగా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత ‘ధమాకా’ (Dhamaka) వంటి పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషించాడు. అయితే తాజాగా ఇతనిపై కూకట్‌పల్లి పీఎస్‌లో కేసు నమోదవ్వడం సంచలనంగా మారింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ అమ్మాయిని ఇతను మోసం చేశాడట.తాజాగా ఆ అమ్మాయి పోలీస్ మెట్లు ఎక్కింది. ఆమె ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు శ్రీతేజ్‌పై బీఎన్‌ఎన్‌ (Bharatiya Nyaya Sanhita) 69, 115 (2), 318 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Pushpa

ఈ కేసు గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అయితే గతంలో కూడా శ్రీతేజ్‌ పై ఇలాంటి కేసు ఒకటి నమోదైంది. పెళ్లైయిన ఓ అమ్మాయితో ఇల్లీగల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసినట్లు ఆ కేసు నమోదైంది. విషయం తెలుసుకున్న ఆ మహిళ భర్త గుండెపోటుతో మరణించాడు. మాదాపూర్‌ పోలీస్ స్టేషన్లో అప్పుడు శ్రీతేజ్ పై కేసు నమోదవ్వడం జరిగింది. శ్రీతేజ్ ప్రస్తుతం ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) సినిమాలో నటిస్తున్నాడు. ‘పుష్ప'(Pushpa)  లో కూడా ఇతను నటించాడు.

అల్లు అర్జున్ కి (Allu Arjun) అన్న పాత్రలో ఇతను నటించాడు.అన్నదమ్ములైన మొల్లేటి మోహన్ రాజ్ (అజయ్), మొల్లేటి ధర్మ రాజ్(శ్రీతేజ్)..ల తండ్రి రెండో భార్య సంతానంగా పుష్ప రాజ్(అల్లు అర్జున్) ని సినిమాలో చూపించారు. సెకండ్ పార్ట్ లో శ్రీతేజ్ పాత్ర కీలకంగా ఉంటుందట. ఇదిలా ఉండగా.. ‘పుష్ప’ ‘పుష్ప 2’ సినిమాలకు పనిచేసిన వాళ్లపై చీటింగ్ కేసులు నమోదవడం గమనార్హం. కేశవ పాత్ర చేసిన జగదీష్ (Jagadesh) .. ఓ అమ్మాయిని ‘మోసం చేసి.. తర్వాత ఆమెను బ్లాక్ మెయిల్ చేసి..

ఆమె మరణానికి కారణమయ్యాడు’ అంటూ అరెస్ట్ అయ్యి జైలు జీవితం గడిపి వచ్చిన సంగతి తెలిసిందే. ‘పుష్ప 2’ లో కీలక సన్నివేశాల కోసం చిత్ర బృందం రూ.30 లక్షలు ఖర్చు పెట్టి అతని బయటకు తీసుకొచ్చారు. అటు తర్వాత కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై (Jani Master)  కూడా Liగిక ఆరోపణల కేసు నమోదైంది. అతను కూడా జైలుకెళ్లి వచ్చాడు. ఇప్పుడు శ్రీతేజ్ పై కూడా ఓ అమ్మాయి చీటింగ్ కేసు పెట్టడం జరిగింది. మరి ఇతను ఎలాంటి పరిణామాలు ఎదుర్కుంటాడో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus