Jabardasth Show: ‘జబర్దస్త్’ కు పెద్ద ఇబ్బంది వచ్చి పడిందిగా..!

‘జబర్దస్త్’ బుల్లితెర పై కామెడీని పంచుతూ టి.ఆర్.పి ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టించిన షో. దాంతో ‘మల్లెమాల’ వారికి భారీ లాభాలు దక్కేవి. ఈ షో కారణంగా పాపులారిటీ సంపాదించుకుని సినిమాల్లో రాణిస్తున్న వాళ్ళు ఎంతో మంది. షోలో కామెడీ చేసేవాళ్ళే కాదు గ్లామర్ షో వడ్డించే యాంకర్లు అనసూయ, రష్మీ లు వంటివారు కూడా సినిమాల్లో రాణిస్తున్నారు. అయితే ఈ షోకి ఇప్పుడు పెద్ద ఇబ్బంది వచ్చి పడింది.కొన్ని నెలలుగా ఈ షో రేటింగ్లు బాగా తగ్గిపోయాయి. గతంలో 12, 13 రేటింగ్ లు నమోదు చేసిన ‘జబర్దస్త్’ కామెడీ షో ఇప్పుడు ఇప్పుడు 3, 4 రేటింగ్ లకే పరిమితమయ్యింది.

దీనికి కారణం లేకపోలేదు… ‘జబర్దస్త్’ లో స్కిట్స్ ఇంట్రెస్టింగ్ గా న‌వ్వించేవిధంగా ఉండడం లేదు. వాటిని యూ ట్యూబ్‌లో చూసుకోవచ్చులే అని టీవీల్లో చూడడం మానేస్తున్నారు కొంతమంది ప్రేక్షకులు. అంతే కాకుండా జ‌బ‌ర్‌ద‌స్త్ ను పోలిన కామెడీ షోలు ఇప్పుడు చాలానే మొదలయ్యాయి. ‘శ్రీ‌దేవి డ్రామా కంపెనీ’ అనే షో ఈటీవీలోనే ప్రసారం అవుతుంది.కామెడీ ఎక్స్ప్రెస్ అంటూ మాటీవీ లో ఆదివారం మధ్యాహ్నం ఓ షో ప్రసారమవుతుంది. వాటికి మంచి రేటింగ్లే నమోదవుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. ఈ షోలో పాల్గొనే ఫీమేల్ ఆర్టిస్ట్ లకు క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు కూడా తలెత్తుతున్నాయట.

స్టార్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న కొంతమంది సీనియర్ కమెడియన్లు ఈ ఫీమేల్ కంటెస్టెంట్లు ‘సాయంత్రం కాళీనా.. కలుద్దామా’ అంటూ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారట. షో నిర్వాహకులకు ఈ విషయం పై వారు కంప్లైంట్ చేసినా.. వాళ్ళు తగిన చర్యలు తీసుకుంటామని ఆ స్టార్ కమెడియన్లను మందలించే ప్రయత్నం చేసినా వాళ్ళ మాట ఆ స్టార్ కమెడియన్లు వినడం లేదని.. ‘తీసి పారేస్తే తీసి పారెయ్’ అంటూ రెచ్చిపోతున్నారని ఇన్సైడ్ టాక్. అంతేకాకుండా ఎప్పుడెప్పుడు అగ్రిమెంట్ పూర్తవుతుందా అన్నట్టు వాళ్ళు ఎదురుచూస్తున్నాం అని కూడా వాదిస్తున్నారని సమాచారం.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus