‘ఆదిపురుష్’.. కాస్టింగ్ విషయంలో తప్పు చేస్తున్నారా..?

‘బాహుబలి’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్. ప్రస్తుతం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. షూటింగ్ లతో బిజీగా గడుపుతున్నాడు ప్రభాస్. ఈ క్రమలో బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ రూపొందించనున్న ‘ఆదిపురుష్’ సినిమాలో నటించనున్నారు. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. రామాయణం నేపథ్యంలో తెరకెక్కనున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఈ మధ్యకాలంలో ‘ఆదిపురుష్’ సినిమాకి సంబంధించి వస్తోన్న అప్డేట్స్ సినిమాపై ఆసక్తిని తగ్గించేలా ఉన్నాయి.

సినిమాలో విలన్, హీరోయిన్ పాత్రలపై ప్రేక్షకుల అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ప్రభాస్ కి ధీటుగా ఉన్నవారిని ఎంపిక చేసుకుంటారని భావించారు. కానీ రావణుడిని పోలిన విలన్ పాత్రకు సైఫ్ అలీ ఖాన్ ను ఎన్నుకోవడంతో ఆసక్తిసన్నగిల్లింది. ప్రభాస్ ముందు విలన్ గా సైఫ్ నిలవలేడనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నటుడిగా సైఫ్ కి మంచి గుర్తింపు ఉంది. ‘తాన్హాజీ’ సినిమాలో విలన్ గా నటించి ఆకట్టుకున్నారు. కానీ స్క్రీన్ ప్రెజన్స్ విషయంలో ప్రభాస్ ముందు అతడు తేలిపోతాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

విలన్ ఎంపిక విషయంలో సంతృప్తిగా లేని అభిమానులను హీరోయిన్, ఇతర ముఖ్య పాత్రలకు వినిపిస్తోన్న పేర్లు మరింత కలవరపెడుతున్నాయి. కనీసం కియారా అద్వానీ లాంటి వాళ్లని తీసుకుంటారనుకుంటే.. కృతిసనన్ పేరు వినిపిస్తోంది. సీతగా ఆమె ప్రభాస్ సరసన కనిపించనుందని టాక్. కానీ ప్రభాస్ రేంజ్ కి కృతి సరిపోదని అంటున్నారు. అలానే లక్ష్మణుడి పాత్రకి పెద్దగా ఇమేజ్ లేని సన్నీ సింగ్ ని ఎంపిక చేసుకున్నారనే వార్త మరింత నిరాశను కలిగిస్తోంది. ప్రభాస్ లాంటి స్టార్ ని పెట్టుకొని ఇప్పుడు కాస్టింగ్ విషయంలో తప్పు చేస్తున్నారని వాదిస్తున్నారు ఫ్యాన్స్. మరి ఈ విషయంలో నిర్మాతలు జాగ్రత్త పడతారేమో చూడాలి!

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus