సెన్సార్ బోర్డు మీద, సెన్సార్ సర్టిఫికెట్ ఇష్యూ చేసే విధానం మీద ప్రముఖ కథానాయకుడు విశాల్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందిస్తున్న విషయమూ విదితమే. ఈ క్రమంలో ఈ కేసు భారీ మలుపు తిరిగింది. ఆరోపణల నిగ్గు తేల్చేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. విశాల్ ఆరోపణలపై సీబీఐ తన విచారణను మొదలుపెట్టింది. ఈ మేరకు ముగ్గురు వ్యక్తులు, సెన్సార్ బోర్డుకు చెందిన ఓ అధికారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.
తాజాగా నిందితుల ఇళ్లలో సోదాలు మొదలు పెట్టినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు. దీంతో విశాల్ ఆరోపణలు సెన్సార్ బోర్డు, సెన్సార్ విధానం విషయంలో పెద్ద ఎత్తున మార్పులకు కారణమవుతున్నాయి అంటున్నారు. అయితే సీబీఐ ప్రాథమిక విచారణలో విశాల్‌ను లంచం అడిగింది సెన్సార్ బోర్డు సభ్యులు కాదని, ఆ పని చేసిన పెట్టడానికి ఓ థర్డ్ పార్టీ వ్యక్తి అడదిగారని తేలినట్లు ప్రాథమిక సమాచారం. ఈ క్రమంలో మెర్లిన్ మేనకా, జీజా రాందాస్, రాజన్ ఎం అనే ముగ్గురిపై కేసు నమోదు చేశారు.
హిందీలోకి అనువదించిన ‘మార్క్ ఆంటోనీ’ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ కోసం కొందరు వ్యక్తులు సీబీఎఫ్‌సీ తరఫున రూ.7లక్షల లంచం డిమాండు చేశారు. ఆ తర్వాత ఆ మొత్తాన్ని రూ.6.54లక్షలకు తగ్గించారు. అనంతరం సెప్టెంబరు 26న సెన్సార్ సర్టిఫికేట్ జారీ అయ్యింది. అయితే ఈ మొత్తం వ్యవహారం నడిపినందుకు ఓ వ్యక్తి రూ.20 వేలు తీసుకున్నారు అనేది ప్రాథమిక ఆరోపణలు అని సీబీఐ పేర్కొంది. ఇదిలా ఉండగా…
ఇలాంటి పరిణామాలు పునరావృతం కాకుండా సెన్సార్ ప్రక్రియ కోసం ‘ఈ- సినీప్రమాన్’ అనే ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేస్తున్నట్లు సెన్సార్ బోర్డు తెలిపింది. ప్రతి సంవత్సరం సెన్సార్ బోర్డు 12 వేల నుండి 18 వేల సినిమాలకు సర్టిఫికెట్ ఇస్తోందని గుర్తు చేసింది. అయితే అన్ని సినిమాలు చూడాలంటే సెన్సార్ సభ్యులకు సమయం పడుతుందని, కొందరు నిర్మాతలు తమ సినిమాలకు అత్యవసరంగా సర్టిఫికెట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తుంటారు అని గుర్తు చేసింది. మరి విశాల్ (Vishal) విషయంలో ఏం జరిగిందో తెలియాల్సి ఉంది. సీబీఐ ఆ పని చేసిపెడుతుందేమో చూడాలి.
స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!
చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !