టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సినీ కార్మికులకు శుభవార్త చెప్పారు. కరోనా క్రైసిస్ ఛారిటీ సహాయంతో సినీ కార్మికులకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తానని వెల్లడించారు. ఇతర ఇండస్ట్రీలతో పోలిస్తే సినీ రంగానికి చెందిన వాళ్లు కరోనా బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులకు కూడా కరోనా నిర్ధారణ అయింది.
రోజురోజుకు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సినిమాల కోసం పని చేసే వాళ్లను కరోనా భయం వెంటాడుతోంది. ఇలాంటి సమయంలో చిరంజీవి సినీ కార్మికులకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇచ్చే ప్రయత్నం చేస్తామని చేసిన సంచలన ప్రకటనపై ఇండస్ట్రీ వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. వైల్డ్ డాగ్ మూవీ ప్రెస్ మీట్ లో పాల్గొన్న చిరంజీవి సినీ కార్మికుల గురించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 2020 సంవత్సరంలో కరోనా మహమ్మారి వల్ల క్లిష్ట పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీని ఏర్పాటు చేశామని..
కరోనా క్రైసిస్ ఛారిటీ ద్వారా ఎంతోమంది సినీ కార్మికులకు సహాయం చేశామని చిరంజీవి పేర్కొన్నారు. అందులో కొంత మొత్తం మిగిలి ఉందని ఆ డబ్బుతో సినీ కార్మికులకు, కార్మికుల కుటుంబ సభ్యులకు ఫ్రీగా కరోనా వ్యాక్సిన్ ఇచ్చే ప్రయత్నం చేస్తామని మెగాస్టార్ తెలిపారు. ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇచ్చే ఆలోచన అమలు దిశగా అడుగులు వేస్తామని చిరంజీవి పేర్కొన్నారు. ఫ్రీగా కరోనా వ్యాక్సిన్ ఇచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తామని ప్రకటన చేసి చిరంజీవి గొప్పమనస్సును చాటుకున్నారని సినీ కార్మికులు, నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.