Brahmanandam Son Siddharth: బ్రహ్మానందం రెండో కొడుకు సిద్దార్థ్ పెళ్లి వేడుక ఫోటోలు వైరల్!

  • August 18, 2023 / 10:43 PM IST

హాస్య బ్రహ్మ… టాలీవుడ్ స్టార్ కమెడియన్ అయిన బ్రహ్మానందం గారి రెండో కుమారుడు సిద్ధార్థ్ గురించి జనాలకి పెద్దగా తెలీదనే చెప్పాలి. ఆయన మొదటి కొడుకు గౌతమ్ అయితే పలు సినిమాల్లో హీరోగా నటించాడు. అయితే సిద్దార్థ్ మాత్రం సినిమాలకి దూరంగా ఉన్నాడు.అతని నిశ్చితార్థం మే నెలలో ఘనంగా జరిగింది. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ పద్మజా వినయ్ కుమార్తె ఐశ్వర్యతో సిద్ధార్థ్ ఎంగేజ్మెంట్ జరిగింది. ఐశ్వర్య కూడా డాక్టరే. ఇక ఈరోజు అనగా ఆగస్టు 18 న సిద్దార్థ్- ఐశ్వర్య ల వివాహం ఘనంగా జరిగింది.

ఈ వేడుకకు టాలీవుడ్ పెద్దలు అందరూ విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు. ఇక బ్రహ్మానందం చిన్న కొడుకు, పెళ్లి కొడుకు అయిన సిద్ధార్థ్ విదేశాల్లో చదువుకుని.. అక్కడే స్థిరపడినట్లుగా తెలుస్తుంది. పెద్దలు కుదిర్చిన పెళ్లే సిద్దార్థ్ చేసుకున్నట్టు సమాచారం. ఇక అతను వివాహమాడిన ఐశ్వర్య తన తల్లిలేని గైనకాలజీ, ఫర్టిలిటీలో స్పెషలైజేషన్‌ చేసింది. బ్రహ్మానందం గారు ఈ మధ్య కాలంలో ఎక్కువ సినిమాలు చేయడం లేదు. రెండేళ్ల క్రితం ఈయనకి సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే.

అందుకే ఆయన మునుపటిలా సినిమాల్లో నటించలేకపోతున్నారు. ఒకవేళ ఆయన నటించినా.. కుర్చీలో కూర్చునే పాత్రలే చేస్తున్నారు. ఇటీవల వచ్చిన ‘బ్రో’ ‘భోళా శంకర్’ వంటి సినిమాల్లో ఆయన నటించారు. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే .. బ్రహ్మానందం కొడుకు సిద్ధార్థ్ పెళ్లి వేడుకలో రాంచరణ్, ఉపాసన వంటి టాలీవుడ్ సెలబ్రిటీలు సందడి చేశారు. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

 

 

 

 

 

 

 

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus