Adipurush: అదిపురుష్ సినిమా సగం బడ్జెట్ వాళ్ల నుంచే..!

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ నటించిన ది మోస్ట్‌ అవైటెడ్‌ మూవీ ఆదిపురుష్‌. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రామాయణం మహాకావ్యం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. కృతిసనన్‌ జానకి పాత్రలో నటించగా, బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ రావణాసురుడిగా కనిపించనున్నారు. ఈ సినిమా సుమారు రూ.500 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఆదిపురుష్‌ సినిమాను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. ఇప్పటికే అన్నిహంగులు పూర్తి చేసుకున్న ప్రభాస్‌ సినిమా జూన్‌ 16న వరల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. ఇప్పటికే అడ్వాన్స్‌ బుకింగ్‌ కూడా పూర్తయ్యాయి.

రఘురాముడి కథ అందరికీ చేరాలనే ఉద్దేశంతో సినిమా ఇండస్ట్రీలోని పలువురు స్టార్‌ హీరోలు అడ్వాన్స్‌గానే ఆది పురుష్‌ టికెట్లు బుక్‌ చేస్తున్నారు. పేద పిల్లలు, అనాథలు, వృద్ధులకు ఈ టిక్కెట్లను ఉచితంగా అందించనున్నారు. ఇప్పటికే ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ వృద్ధులకు, అనాథలకు ‘ఆదిపురుష్’ మూవీని ఫ్రీగా చూపిస్తానని మాటిచ్చారు. ఇందుకోసం 10 వేల టికెట్స్ కూడా బుక్ చేశారు. ఇక బాలీవుడ్ రాక్‌ స్టార్‌ రణ్బీర్ కపూర్ కూడా పేద పిల్లల కోసం 10 వేల టికెట్స్ బుక్ చేశారు. అలాగే ప్రముఖ వ్యాపారవేత్త కుమార్ మంగళం బిర్లా కూతురు, బాలీవుడ్ స్టార్ సింగర్ అనన్య బిర్లా కూడా ‘ఆదిపురుష్’ మూవీ 10 వేల టికెట్లు బుక్‌ చేశారు.

అయితే తాజాగా టాలీవుడ్‌ స్టార్‌ హీరో.. గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌ కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారట. ఆయన కూడా 10వేల టికెట్లు కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అనాథ పిల్లల కోసం టికెట్లు కొనుగోలు చేసి సినిమాను చూపించనున్నట్లు టాలీవుడ్‌లో టాక్‌. అంతే కాదు అభిమానులకు సైతం ప్రత్యేకంగా టికెట్లు ఇవ్వనున్నట్లు సమాచారం. అలాగే టి.సిరిస్ కూడా కూడా 10వేల టికెట్లు కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అనాథ పిల్లల కోసం టికెట్లు కొనుగోలు చేసి సినిమాను (Adipurush) చూపించనున్నట్లు సమాచారం.

అయితే ఇప్పుడు శ్రేయాస్‌ మీడియా కూడా పాలుపంచుకోనుంది. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రతి రామాలయానికి 101 టిక్కెట్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు శ్రేయాస్‌ మీడియా అధినేత గండ్ర శ్రీనివాస్‌ రావు తెలిపారు. ఖమ్మం జిల్లాలో భద్రాద్రి రాముడు కోలువై ఉండటంతో.. ఈ జిల్లాకు మాత్రమే ఈ అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ జాబితాలో మంచు మనోజ్ చేశారు. 2,500 టిక్కెట్లు బుక్ చేసి తెలుగు రాష్ట్రాల్లో అనాథ పిల్లలకు చూపించనున్నారు.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus