తల్లి కాబోతున్న ఇలియానా.!

పోకిరి సినిమాతో యువకుల హృదయాలను గిలిగింతలు పెట్టిన ఇలియానా.. వరుస విజయాలతో అతి తక్కువకాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. బాలీవుడ్ లో అవకాశం రాగానే ముంబై లో మకాం వేసింది గోవా బ్యూటీ. గత ఐదేళ్ళలో ఐదు చిత్రాలను మాత్రమే చేసిన ఇలియానా తెలుగులోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి నానా ప్రయత్నాలు చేసింది. హాట్ డ్రస్సుల్లో ఫోటోలు రిలీజ్ చేసింది. బాయ్ ఫ్రెండ్స్ తో ముద్దుల వీడియోలను కూడా నెట్లో పెట్టింది. అప్పట్లో ఆస్ట్రేలియాకు చెందిన ఫొటోగ్రాఫర్‌ ఆండ్రూ నీబోన్‌ను ఇలియానా ప్రేమ వివాహం చేసుకొని సినిమాలకు దూరమైందని వార్తలు కూడా గుప్పుమన్నాయి. ఈ విషయాన్ని ఇలియానా ఖండించింది. అయితే ఈ వార్త నిజమని బాలీవుడ్ మీడియా కథనాలను ప్రచురిస్తోంది.

కేవలం పెళ్లి మాత్రమే కాలేదు ఇలియానా తల్లి కాబోతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ‘రెయిడ్‌’ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇలియానా తాను గర్భం దాల్చిన సంగతి తెలీకుండా ఉండేందుకు వదులైన దుస్తులు వేసుకుందని బీటౌన్ వర్గాలు అంటున్నాయి. అదీకాకుండా ఆండ్రూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన భార్య ఫొటోను షేర్‌ చేశారు. ఫొటోలో ఇలియానా బాత్‌టబ్‌లో సేదతీరుతూ కాఫీ తాగుతూ కన్పించారు. “ఇలియానా ఒంటరిగా మధురమైన సమయాన్ని గడుపుతున్నారు” అని క్యాప్షన్‌ ఇవ్వడంతో ఆమె గర్భం దాల్చినట్లు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి దీనిపై ఇలియానా ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus