ఫిట్‌నెస్‌తో షాక్ ఇస్తున్న సీనియర్ యాక్టర్స్!

సినిమా ప్రపంచంలో ఫిట్‌నెస్‌ మెయింటైన్ చేయడమనేది చాలా ముఖ్యమైన విషయం. ఇటీవల కాలంలో అయితే చాలామంది స్టార్స్ వయసుతో సంబంధం లేకుండా గ్లామర్ ను మెయింటైన్ చేస్తూ సరికొత్తగా కనిపిస్తున్నారు. ఇక ఇటీవల కాలంలో చాలా తొందరగా బరువు తగ్గిన కొంతమంది సీనియర్ నటీనటులు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారారు. నవ్వడంతోనే మంచి థెరపీ దాగి ఉందని అంటూ.. అందుకే నవ్వండి అని సీనియర్ నటి జయసుధ వివరణ ఇచ్చారు.

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి సినిమాలు చేసుకుంటూ వెళుతున్న ఆమె ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ఫొటోలో చాలా బరువు తగ్గినట్లు అనిపిస్తోంది. ఇక పూర్తిగా శాకాహారమే అనేలా ‘వీగన్‌ ఫుడ్‌ ట్రై చేద్దాం’ అని ట్వీట్‌ చేశారు. ఇక ఫిట్‌నెస్‌ విషయంలో అందరిని ఆశ్చర్యపరిచిన మరో సీనియర్ నటి ఖుష్బూ ఒకరు. కొన్ని నెలల క్రితం 15 కిలోలు బరువు తగ్గినట్లు చెప్పిన కుష్బూ రీసెంట్ గా వెయిట్‌ మిషన్‌పై నిల్చున్న ఫొటోను షేర్ చేసుకుంటూ మరో ఐదు కిలోలు తగ్గినట్లు చెప్పారు.

ఇక సడన్ గా బరువు తగ్గడంతో కొందరు ఆందోళన చెందారని హఠాత్తుగా తగ్గడంలో మరొకటి ఏమి లేదని వ్యాయాయం చేయడం వల్లనే బరువు తగ్గినట్లు చెప్పారు. ఇక మరొక సీనియర్ నటుడు ఖుష్బూ తరహాలోనే 20 కిలోలు బరువు తగ్గారు. అయితే ప్రభు మాత్రం ఫిట్నెస్ కోసం కాకుండా.. మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ కోసం తగ్గినట్లు సమాచారం.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus