జోగినాయుడుకి శుభాకాంక్షలు చెబుతున్న సినీ ప్రముఖులు

విడాకులు తీసుకున్న తర్వాత భార్య అయినా, భర్త అయినా ఒంటరిగానే జీవితాన్ని గడపాల్సిన అవసరం లేదని, మనసుకు నచ్చిన వారిని వివాహం చేసుకొని.. కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చని పలువురు సినీ ప్రముఖులు చాటి చెప్పారు. అటువంటి వారి జాబితాలో నటుడు జోగినాయుడు చేరారు. జెమినీ టీవీలో జోగి బ్రదర్స్‌గా అన్నయ్య కృష్ణంరాజుతో కలిసి ప్రోగ్రామ్‌లు చేశారు. నవ్వించారు. అలాగే స్వామిరారా వంటి అనేక సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించి మెప్పించారు. జెమినీ టీవీలో ప్రోగ్రాం డైరెక్టర్ గా పనిచేస్తున్న సమయంలో జోగినాయుడు, యాంకర్ ఝాన్సీకి పరిచయం కావడం.. ప్రేమగా మారి వీరిద్దరి పెళ్లి వరకూ దారి తీసింది.

కొంత కాలం వీరి దాంపత్యం సాఫీగా సాగినా.. కొన్ని గొడవల వల్ల చట్టపరంగా విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఒంటరిగా జీవిస్తున్న ఇతను రెండో పెళ్లి చేసుకున్నారు. అన్నవరంలోని శ్రీ సత్యనారాయణస్వామి ఆలయంలో, తన స్వగ్రామమైన విశాఖ జిల్లా నాతవరం మండలం చెర్లోపాలెం గ్రామానికి చెందిన సౌజన్యను సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు. ఈ సందర్భంగా జోగినాయుడికి పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus