పెళ్ళిలో పెళ్లి కూతురు పసుపు చీర కట్టుకోవడం అనేది తరతరాల నుండి వస్తున్న ఆనవాయితీ. బట్ ఫర్ ఏ ఛేంజ్.. పెళ్ళికి రెడ్ శారీనే అందం అని ప్రూవ్ చేస్తున్నారు కొంతమంది స్టార్ హీరోయిన్లు. పెళ్లిలో ఎన్ని రకాల ఫ్యాషన్స్ వచ్చినా, ఎన్ని పేస్టల్ కలర్స్ ట్రెండ్ అయినా.. ‘ఎరుపు’ రంగుకున్న రాయల్టీనే వేరు అని హీరోయిన్లు నిరూపిస్తున్నారు. పెళ్లి కూతురు అంటే రెడ్ కలర్ శారీ లేదా లెహంగాలో ఉండాల్సిందే అని అంతా ఫిక్స్ అయ్యేలా చేస్తున్నారు.
రీసెంట్‌గా పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలంతా తమ వెడ్డింగ్ కోసం ఐకానిక్ రెడ్ కలర్ ఎంచుకోవడం విశేషం. వాళ్ళు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :
1)నయనతార: లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara), దర్శకుడు విఘ్నేష్ శివన్ ను 2022, జూన్ 9న మహాబలిపురంలో పెళ్లి చేసుకున్నారు. రెడ్ కలర్ శారీలో, హెవీ జ్యువెలరీతో నయన్ లుక్ అదిరిపోయింది.
2)కత్రినా కైఫ్: బాలీవుడ్ బ్యూటీ కత్రినా(Katrina Kaif), హీరో విక్కీ కౌశల్ ను 2021, డిసెంబర్ 9న రాజస్థాన్‌లో వివాహం చేసుకుంది. సవ్యసాచి డిజైన్ చేసిన క్లాసిక్ రెడ్ లెహంగాలో కత్రినా మెరిసిపోయింది.
3)లావణ్య త్రిపాఠి: మెగా కోడలు లావణ్య, హీరో వరుణ్ తేజ్ ను 2023, నవంబర్ 1న ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంది.
4)వరలక్ష్మి శరత్ కుమార్: నికోలాయ్ సచ్‌దేవ్ తో వరలక్ష్మి వివాహం 2024, జులై 3న థాయ్‌లాండ్‌లో ఘనంగా జరిగింది.
5)అదితి రావు హైదరీ: సిద్దార్థ్-అదితి జోడి చాలా కాలంగా ప్రేమలో ఉంది. వీరు 2024, సెప్టెంబర్ 16న వనపర్తిలోని ఓ ఆలయంలో సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు.
6)ప్రియాంక చోప్రా: గ్లోబల్ స్టార్ ప్రియాంక(Priyanka Chopra), పాప్ సింగర్ నిక్ జోనస్ ను 2018, డిసెంబర్ 1న జోధ్‌పూర్‌లో హిందూ, క్రిస్టియన్ పద్ధతుల్లో పెళ్లి చేసుకుంది.
7)సమంత : సమంత(Samantha) రెండు రోజుల క్రితం అంటే డిసెంబర్ 1 2025 రాజ్ నిడుమోర్ ని వివాహం చేసుకుంది. తన పెళ్ళిలో సమంత రెడ్ డ్రెస్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది
ఫ్యాషన్ మారుతున్నా, పెళ్లి పీటల మీద ఎరుపు రంగుకున్న క్రేజ్ మాత్రం తగ్గదని ఈ స్టార్స్ మరోసారి నిరూపించారు. భవిష్యత్తులో కూడా హీరోయిన్లు ఇదే ట్రెండ్ ఫాలో అవుతారేమో చూడాలి.
