విడుదలకు ముస్తాబవుతున్న చైతన్య అక్కినేని ‘ప్రేమమ్’

చైతన్య అక్కినేని, శ్రుతిహాసన్,మడొన్నాసెబాస్టియన్,అనుపమ పరమేశ్వరన్ ల కాంబినేషన్ లో, దర్శకుడు ‘చందు మొండేటి దర్శకత్వంలో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’ పతాకంపై పి.డి.వి ప్రసాద్ సమర్పణలో నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమమ్’.

చిత్రం విడుదలకు ముస్తాబవుతున్న సందర్భంగా యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ..’ చిత్రం లోని తొలి పాటను ఈ నెల 18న ఎఫ్ మ్ లలో విడుదల చేస్తున్నాము. ఈ నెల 24 న ఆడియోను చిత్ర ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరుపనున్నాము. ప్రేమతో కూడిన సంగీత భరిత దృశ్య కావ్యం అయిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 9న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.
చిత్రంలోని ఇతర తారాగణం ఈశ్వరీరావు,జీవా, బ్రహ్మాజీ, శ్రీనివాస రెడ్డి,పృథ్వి,నర్రాశ్రీను, ప్రవీణ్, చైతన్యకృష్ణ, అరవిందకృష్ణ , సత్య,కార్తీక్ ప్రసాద్, నోయల్, జోగి బ్రదర్స్.

ఈ చిత్రానికి సంగీతం; గోపిసుందర్, రాజేష్ మురుగేషన్,
పాటలు: రామజోగయ్య శాస్త్రి,వనమాలి, శ్రీమణి, పూర్ణ, కృష్ణ మాదినేని; చాయా గ్రహణం: కార్తీక్ ఘట్టమనేని: ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు; ఆర్ట్: సాహి సురేష్; ఒరిజినల్ స్టోరి: ఆల్ఫోన్సె పుధరిన్;
సమర్పణ: పి.డి.వి. ప్రసాద్
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
స్క్రీన్ ప్లే – మాటలు – దర్శకత్వం: చందు మొండేటి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus