ఈ నెల 13న విడుదలవుతున్న చైతన్యం

కౌటిల్య, యాషిక జంటగా సూర్య దర్శకత్వంలో జెఎమ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మురళీ మోహన్ రెడ్డి, రఘునాధ్ ఈశ్వర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘ చైతన్యం ‘. ఫ్యామిలీ, కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే విడుదలైన టీజర్, తో మంచి క్రేజ్ తెచ్చుకుంది. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. సెన్సార్ నుండి యూ సిర్టిఫికెట్ వచ్చింది. ఈ చిత్రాన్ని ఈ నెల 13న వన్ మీడియా సంస్థ ద్వారా విడుదల చేస్తున్నారు. ఈ సందర్బంగా దర్శకుడు సూర్య మాట్లాడుతూ … ఎవరో వస్తారు ఎదో చేస్తారని బద్దకంతో అచేతనంగా బతికితే మనిషిని, సమాజాన్ని, దేశాన్ని అది ఎప్పటికి ఎదగనీయదు. కానీ అందరిలా తాను అలా కాకూడదు అనుకున్న ఓ యువకుడు గొప్పగా బ్రతకాలని కలలు కని దుబాయ్ వెళ్లి బాగా డబ్బు సంపాదించాలనే ప్రయత్నాల్లో ఉంటాడు. అయితే అతని జీవితంలో వచ్చిన అడ్డంకులు ఎదుర్కొని ఎలా ముందుకు కదిలాడు అన్న ఆసక్తికర కథాంశంతో తెరకెక్కించిన చిత్రమిది. చైతన్యం లేకుంటే మనిషి బతుకు దుర్భరం అని చెప్పే ప్రయత్నం చేసాం. కౌటిల్య, యాషిక తమ తమ పాత్రల్లో చక్కగా చేసారు. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మాతలు ఇచ్చిన సపోర్ట్ తో చిత్రాన్ని క్వాలిటీతో నిర్మించాం.. తప్పకుండా ఇది అందరికి నచ్చుతుందన్న నమ్మకం ఉంది అన్నారు.

నిర్మాతలు మురళీ మోహన్ రెడ్డి, రఘునాధ్ ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ .. చాలా మంచి కథ ఇది. పథకాల పేరుతొ ప్రజలను కొందరు ఎలా చేతకానివాళ్ళలా మారుస్తున్నారు, దానివల్ల ప్రజలు ఎలా తయారవుతున్నారు అన్న పాయింట్ ఈ సినిమాలో హైలెట్ గా నిలుస్తుంది. చైతన్యం కలవాడు ముందడుగు వేస్తె ఎలా ఉంటుంది అన్న ఆసక్తికర కథాంశంతో తెరకెక్కిన కథ ఇది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి, ఈ నెల 13న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం అన్నారు.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus