నవదీప్, శివ బాలాజీ హీరోలుగా కాజల్, సింధు మీనన్ హీరోయిన్లుగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చందమామ’. సి.కళ్యాణ్ మరియు ఎస్.విజయానంద్ లు నిర్మించిన ఈ చిత్రం 2007వ సంవత్సరం సెప్టెంబర్ 6న రిలీజ్ అయ్యింది. నేటితో ఈ చిత్రం విడుదలై 14 ఏళ్ళు పూర్తికావస్తోంది. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. కె.ఎం.రాధా కృష్ణన్ అందించిన సంగీతం, ప్రసాద్ మురెళ్ళ సినిమాటోగ్రఫీ ఈ చిత్రం విజయంలో కీలక పాత్ర పోషించాయని చెప్పాలి. సినిమా చూస్తున్నంత సేపు ఓ పండుగ వాతావరణాన్ని తలపించేలా తెరకెక్కించాడు దర్శకుడు కృష్ణవంశీ.
ఫుల్ రన్లో ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 2.58 cr |
సీడెడ్ | 1.19 cr |
ఉత్తరాంధ్ర | 1.21 cr |
ఈస్ట్ | 0.39 cr |
వెస్ట్ | 0.36 cr |
గుంటూరు | 0.75 cr |
కృష్ణా | 0.64 cr |
నెల్లూరు | 0.36 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 7.48 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 1.87 Cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 9.35 cr |
‘చందమామ’ చిత్రానికి రూ.4.85 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.9.35 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ చిత్రం కొనుగోలు చేసిన బయ్యర్లకు రూ.4.5 కోట్ల వరకు లాభాలు దక్కినట్టు తెలుస్తుంది.
Most Recommended Video
బిగ్ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!