Chandini Chowdary: వాట్సాప్‌ మెసేజ్‌లతో చాందినీ చౌదరిని వేధిస్తున్నది ఎవరంటే..!

సోషల్ మీడియా వాడకం అనేది ఎంత పెరిగితే అంతగా నేరాలు కూడా పెరిగిపోతున్నాయి.. సెలబ్రిటీలు కూడా వేధింపులకు గురవుతున్నారు.. సైబర్ నేరగాళ్ల చేతుల్లో చాలా తేలిగ్గా మోసపోతున్నారు.. ఇక హీరోయిన్లు ఎక్కువగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు.. సోషల్ మీడియాలో తమ అకౌంట్ హ్యాక్ అయిందంటూ.. వేధింపులకు పాల్పడుతున్నారని ఇప్పటికే పలువురు నటీనటులు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడం చూశాం.. ఇటీవలే యాంకర్ కమ్ యాక్ట్రెస్ అనసూయ భరద్వాజ్‌‌ని వేధిస్తున్న వ్యక్తిని..

హీరోయిన్ పార్వతీ నాయర్ మీద ఆరోపణలు చేసిన పనివాడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.. ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరోయిన్ చాందిని చౌదరి తనను గుర్తు తెలియని కొందరు వ్యక్తులు వేధిస్తున్నారంటూ చెప్పడం చర్చనీయాంశంగా మారింది.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే తెలుగమ్మాయి చాందినీ అందుకు సంబంధించివ స్క్రీన్ షాట్లను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రేక్షకులతో షేర్ చేసుకుంది..‘‘గత కొన్ని నెలల నుండి అంతర్జాతీయ నంబర్స్ ఉపయోగించి కొంతమంది వ్యక్తులు స్కామ్‌కి పాల్పడుతున్నారు..

వ్యక్తిగత సమాచారం తెలుసుకోవడానికి మా పేర్లు వాడుకుంటూ వాట్సాప్‌లో మెసేజులు పంపిస్తున్నారు.. అంతటితో ఆగకుండా వేధింపులకు కూడా పాల్పడుతున్నారు.. ఇలా నన్నే కాదు.. నా కో స్టార్స్ పేర్లు, ఫోటోలను కూడా వాడుతున్నారు.. మీలో ఎవరికైనా ఇలాంటి మెసేజెస్ వస్తే దయచేసి రిపోర్ట్ చేయండి.. మీ వివరాలను వారితో షేర్ చేసుకోకండి’’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో స్క్రీన్ షాట్లను షేర్ చేసింది చాందినీ చౌదరి.. షార్ట్ ఫిలింస్‌తో కెరీర్ స్టార్ట్ చేసి..

హీరోయిన్‌గా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది చాందినీ చౌదరి.. ‘కలర్ ఫోటో ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.. ఈ మూవీతో నటనపరంగా ప్రశంసలు అందుకుంది.. ఇటీవల ‘సమ్మతమే’ సినిమాతో అలరించింది.. పాపులర్ ఓటీటీల్లో వెబ్ సిరీసులు చేస్తూ బిజీగా ఉంది.. అలాగే యంగ్ హీరో నవదీప్ తన మిత్రుడితో కలిసి నిర్మిస్తున్న సినిమాలోనూ ప్రధాన పాత్రలో నటిస్తోంది చాందినీ చౌదరి..

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus