దాదాపు మూడు దశాబ్దాల పాటు తెలుగులో నంబర్ వన్ హీరోగా మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ను కొనసాగించారు. శంకర్ దాదా జిందాబాద్ సినిమా తర్వాత ప్రజలకు సేవ చేయాలనే సదుద్దేశంతో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి చిరంజీవి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే కొన్ని పొరపాట్ల వల్ల ప్రజారాజ్యం పార్టీ ఆశించిన స్థాయిలో ఫలితాలను సాధించలేదు. 2009 ఎన్నికల్లో కేవలం 18 అసెంబ్లీ స్థానాలలో ప్రజారాజ్యం విజయం సాధించింది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సీఎంగా ఎన్నికయ్యారు.
అయితే 2009 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాకపోవడానికి మెగాస్టార్ చిరంజీవి కారణమని చంద్రబాబు షాకింగ్ కామెంట్లు చేశారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టడానికి ముందు, పెట్టిన తర్వాత చిరంజీవి తనతో బాగానే ఉన్నారని చంద్రబాబు అన్నారు. తాను సీఎంగా ఉన్న సమయంలో కూడా తనకు వ్యతిరేకంగా సినిమాలు తీశారని చంద్రబాబు వెల్లడించారు. చిరంజీవి పార్టీ పెట్టకుండా ఉండి ఉంటే టీడీపీ అధికారంలోకి వచ్చేదని చంద్రబాబు చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ కామెంట్ల గురించి చిరంజీవి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. చిరంజీవి ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. చిరంజీవి జనసేనకు మద్దతు ఇవ్వాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు చిరంజీవి, చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా రిలీజ్ డేట్ మారే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. కరోనా కేసులు, ఆక్యుపెన్సీ నిబంధనల వల్ల ఈ సినిమా రిలీజ్ డేట్ మారే ఛాన్స్ అయితే ఉంది.
సినిమా రిలీజ్ కు కొన్ని రోజుల ముందు రిలీజ్ డేట్ మార్పుకు సంబంధించి ప్రకటన చేసే అవకాశాలు ఉంటాయి. 100 కోట్ల రూపాయలకు పైగా భారీ బడ్జెట్ తో ఆచార్య తెరకెక్కింది. కాజల్, పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. కొరటాల శివ ఈ సినిమాతో మరో సక్సెస్ అందుకుంటారేమో చూడాల్సి ఉంది.