Chandrabose: పాటల పాఠాలతో పురస్కారాలు అందుకుంటున్న చంద్రబోస్‌!

‘నాకు ఇప్పటివరకు నేషనల్‌ అవార్డు అయితే రాలేదు… కానీ ఆస్కార్‌ అవార్డు వచ్చింది’ అంటూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కి ఆస్కార్‌ గెలిచిన ఆనందంలో అన్నారు ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్‌. ఆయన ఏ ముహూర్తాన అన్నారో కానీ.. ఆయనకు ఈ ఏడాది జాతీయ అవార్డు వచ్చేసింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని ‘నాటు నాటు..’ పాటకు ఆస్కార్‌ వచ్చింది. అయితే ఇప్పుడు నేషనల్‌ అవార్డు మరో సినిమా నుండి వచ్చింది. ఆ సినిమాలోని పాటకు నేషనల్‌ అవార్డు వస్తుందని ఆయన కూడా అనుకోలేదట.

అందరూ ఇంట గెలిచి.. రచ్చ గెలవాలి అంటారు కదా. కానీ (Chandrabose) చంద్రబోస్‌ మాత్రం రచ్చ గెలిచి.. ఇంట గెలిచారు. ‘నాటు నాటు..’ పాటకుగానూ ఆస్కార్‌, గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డులు అందుకున్నారు చంద్రబోస్‌. ఇప్పుడు ‘కొండపొలం’ సినిమాలోని ‘ధామ్‌ ధామ్‌…’ అనే పాటతో జాతీయ పురస్కారం సాధించి ఇంట గెలిచారు. ఇలా వరుసగా పెద్ద అవార్డులు గెలుచుకుంటున్నారు కదా… ఎలా అనిపిస్తోంది అంటే.. ఈ ఏడాదిలోనే జీవితమే సఫలమైనట్లుంది అని ఆనందంగా చెప్పారు చంద్రబోస్‌.

జాతీయ అవార్డు గెలుచుకోవడం ఆయన 15 ఏళ్ల కల. ఏటా పురస్కారాల సమయంలో వెయిట్‌ చేయడం, రాకపోవడం నిరాశపడటం తనకు అలవాటు అయిపోయిందని.. కానీ ఈ సారి అనుకోని రీతిలో ‘కొండపొలం’ పాటకు దక్కించుకున్నానని చెప్పారు చంద్రబోస్‌. అడవి గురించి, పర్యావరణం గురించి, ప్రజలకు అవి చేసే మేలు గురించి పాట రాశాను. ఇప్పుడు అదే నాకు అవార్డు తెచ్చి పెట్టింది అని చంద్రబోస్‌ అన్నారు.

నిజానికి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘పుష్ప’ సినిమాల్లో పాటలకు అవార్డు వస్తుందని అనుకున్నానని.. కానీ ఇప్పుడు దీనికి వచ్చిందని చెప్పారు ఆయన. చంద్రబోస్‌ విషయానికొస్తే ఎన్నో ఏళ్లుగా ఆయన పాటలు రాస్తున్నారు. ప్రతి సినిమాలోనూ ఆయన పాట అంటే ఓ పాఠం అని అంటుంటారు. ఇప్పుడు ఆయనకు అవార్డులు తెచ్చి పెట్టిన పాటలు కూడా జీవిత పాఠాలే అని చెప్పొచ్చు. అలా ఆయన పాటల పాఠాలతో పురస్కారాలు అందుకుంటున్నారు.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus