Chandramukhi 2 First Review: చంద్రముఖి2 మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

రెండు తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయి థియేటర్లలో చంద్రముఖి2 సినిమా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతోంది. ఏఏఏ సినిమాస్, ఏఎంబీ మల్టీప్లెక్స్ లలో ఈ సినిమాకు బుకింగ్స్ బాగానే ఉండగా మిగతా థియేటర్లలో మాత్రం ఈ సినిమా బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు. సినిమా టాక్ ఆధారంగా ఈ సినిమా బుకింగ్స్ లో మార్పు ఉండే అవకాశం అయితే ఉంది.

మరోవైపు కొన్నిరోజుల క్రితం ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకోగా సెన్సార్ సభ్యుల నుంచి ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. సెన్సార్ సభ్యులు ఈ సినిమా బాగుందని అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ఉందని లారెన్స్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మాతలు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.

చంద్రముఖి2 సినిమా సక్సెస్ సాధిస్తే రజనీకాంత్ లారెన్స్ కాంబోలో చంద్రముఖి3 సినిమా తెరకెక్కనుందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం. చంద్రముఖి2 సినిమా సక్సెస్ సాధించడం కంగనా రనౌత్ కు కూడా కీలకమని చెప్పవచ్చు. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే కంగనా రనౌత్ కు సౌత్ లో ఆఫర్లు పెరిగే అవకాశం అయితే ఉంటుందనే సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి టాక్ వస్తుందో చూడాల్సి ఉంది.

చంద్రముఖి2 (Chandramukhi 2) సినిమాలో కంగనా జ్యోతికను మించి మెప్పిస్తారేమో చూడాలి. చంద్రముఖి2 సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగింది. చంద్రముఖి2 సినిమాకు పోటీగా చాలా సినిమాలు రిలీజ్ అవుతుండటంతో ఏ సినిమా పైచేయి సాధిస్తుందో చూడాల్సి ఉంది. స్కంద, చంద్రముఖి2, పెదకాపు1 సినిమాలు వేర్వేరు జానర్లలో తెరకెక్కడం గమనార్హం. ఈ సినిమాల రిజల్ట్ కోసం ఫ్యాన్స్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus