Chandramukhi 2 Trailer: నాంతాండ చంద్రముఖి అంటూ భయపెడుతున్న కంగనా..!

రాఘవ లారెన్స్ మోస్ట్ ఎవెయిటెడ్‌ ప్రాజెక్ట్‌ చంద్రముఖి 2. పి వాసు డైరెక్షన్ లో రూపొందుతున్నఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఆద్యంతం ఆసక్తి కలిగించే ఈ ట్రైలర్ ఆడియన్స్ని మరోసారి చంద్రముఖి గదిలోకి తీసుకెళ్లినట్టు తెలుస్తుంది.

ఇక చంద్రముఖి పార్ట్1 క్లైమాక్స్ ఎండ్ అయినా భవనం నుంచి..బయటికి వచ్చిన పాముతోనే చంద్రముఖి 2 ట్రైలర్ స్టార్ట్ అయింది..వెట్టయరాజాగా కనిపిస్తున్న రాఘవ లారెన్స్ లుక్ ఆకట్టుకుంటుంది. రాధికా శరత్ కుమార్ టెన్షన్ పడుతూ..ఆ భవనంలోకి ఎంట్రీ అవ్వడం..ఇద్దరు పిల్లలను అడగటం..అర నిమిషం పాటు ఫ్యామిలీ ఆట పాటలు చూపించారు డైరెక్టర్ వాసు.

ఇక స్టార్ కమెడియన్ వడివేలు ఆ భవనంలోకి ఎంట్రీ ఇస్తూ..తలుపు చాటు గజ్జల చప్పుళ్లు, విని భయపడుతూ..’ఇది అదేరా’ చంద్రముఖి మళ్ళీ వచ్చిందంటూ భయపెట్టే సీన్స్ ఎంతో ఆసక్తిగా ఉన్నాయి.అసలైన చంద్రముఖిని చూడటానికి లారెన్స్ ట్రై చేయగా.. నాంతాండ చంద్రముఖి అంటూ భయపెడుతున్న కంగనా రనౌత్ కనిపించిన తీరు.. తన అందం చంద్రముఖిలా చక్కగా కుదిరింది.

ఇక ఈ మూవీలో లారెన్స్ ప్రసెంట్..పాస్ట్ గెటప్స్లో కనిపించబోతున్నారు.వెట్టయరాజగా ఫ్లాష్‍బ్యాక్‍లో లారెన్స్ రాజసం చూపించారు.అలాగే ఈ ట్రైలర్లో చంద్రముఖి, వెట్టయరాజకి మధ్యన ఉన్న 200 ఏళ్ళ నాటి పగను చూపిస్తున్నట్టు ట్రైలర్లో పేర్కొన్నారు. ఇక ఈ ట్రైలర్ ఎండింగ్లో లారెన్స్ కత్తి తిప్పటం, యుద్ధం సీక్వెన్స్ ఉండబోతున్నట్లు క్యూరియాసిటీని పెంచేశారు.దాదాపు 17ఏళ్ల తర్వాత చంద్రముఖి మూవీకు సీక్వెల్‌ తెరకెక్కుతుండటం విశేషం. హర్రర్, కామెడీతో ఆసక్తి రేకెత్తిస్తున్న ‘చంద్రముఖి’ 2 ట్రైల‌ర్ గణేష్ చతుర్థి సందర్భంగా ఈ సినిమాను 2023 సెప్టెంబర్ 15న రిలీజ్ చేయనున్నారు.

తమిళంతోపాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ మూవీకి గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు విన్నర్‌, లెజెండరీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. లైకా ప్రొడ‌క్షన్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో కంగనా రనౌత్, వడివేలు, రాధిక శరత్ కుమార్, లక్ష్మీ మీనన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Read Today's Latest Trailers Update. Get Filmy News LIVE Updates on FilmyFocus