సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా పి.వాసు దర్శకత్వంలో రూపొందిన హారర్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ‘చంద్రముఖి’ . మళయాళం మూవీ ‘మణిచిత్రతాయు’ కి రీమేక్ గా తెరకెక్కిన మూవీ ఇది. తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఏక కాలంలో 2005 వ సంవత్సరం ఏప్రిల్ 14న విడుదలయ్యింది. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో జ్యోతిక, ప్రభు లు కీలక పాత్రలు పోషించారు. ముఖ్యంగా ‘చంద్రముఖి’ గా జ్యోతిక నటన అద్భుతమనే చెప్పాలి.
మొదట ఈ చిత్రం పై ఎటువంటి అంచనాలు లేవు కానీ విడుదలైన తర్వాత హిట్ టాక్ రావడంతో ఈ మూవీ చూడ్డానికి జనాలు ఎగబడ్డారు. ఈరోజుతో ఈ చిత్రం విడుదలై 17 ఏళ్ళు పూర్తి కావస్తోంది.
మరి ఫుల్ రన్లో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 3.46 cr |
సీడెడ్ | 3.22 cr |
ఉత్తరాంధ్ర | 1.98 cr |
ఈస్ట్ | 0.89 cr |
వెస్ట్ | 0.81 cr |
గుంటూరు | 1.17 cr |
కృష్ణా | 1.02 cr |
నెల్లూరు | 0.49 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 13.04 cr |
‘చంద్రముఖి’ తెలుగు వెర్షన్ కు రూ.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.13.04 కోట్ల షేర్ ను రాబట్టింది. దాంతో బయ్యర్లు రూ.4.04 కోట్ల లాభాలు దక్కాయి. దీంతో ఈ చిత్రాన్ని సూపర్ హిట్ గా పరిగణించాలి. ‘చంద్రముఖి’ కి ముందు రజినీకాంత్ నటించిన ‘బాబా’ చిత్రం ఇక్కడ ప్లాప్ అయ్యింది. అయితే ‘చంద్రముఖి’ తో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కారాయన.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!