Hanu Man OTT: మార్చి 2వ తేదీన హనుమాన్ స్ట్రీమింగ్ కాదా.. కారణాలివేనా?

తేజ సజ్జా ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కిన హనుమాన్ మూవీ బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోవడంతో పాటు హిందీ బాక్సాఫీస్ వద్ద కూడా అదుర్స్ అనే రేంజ్ లో కలెక్షన్లను సాధించింది. హనుమాన్ మూవీ బడ్జెట్ తో పోల్చి చూస్తే ఊహించని రేంజ్ లో లాభాలు వచ్చాయి. చిన్న సినిమాలలో ఈ సినిమా స్థాయిలో సక్సెస్ సాధించిన మరో సినిమా లేదు. అప్పట్లో బాహుబలి2 బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో ఏ స్థాయిలో ప్రభంజనం సృష్టించిందో ఇప్పుడు హనుమాన్ మూవీ కూడా అదే స్థాయిలో ప్రభంజనం సృష్టించింది.

హనుమాన్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మార్చి నెల 2వ తేదీన జీ5 వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుందని అందరూ భావించారు. అయితే జీ5 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కు సంబంధించి ఎలాంటి ప్రకటన రాలేదు. హిందీ వెర్షన్ కు సంబంధించిన రూల్స్ వల్లే ఈ సినిమా ఆలస్యంగా స్ట్రీమింగ్ అవుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన ఇతర సినిమాలు ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా హనుమాన్ మూవీ విషయంలో మాత్రం ఒకింత గందరగోళం నెలకొంది.

అయితే వచ్చే వారం నుంచి జీ5 ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హనుమాన్ మూవీ ఫ్యాన్స్ కు మరో వారం ఎదురుచూపులు తప్పవని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. థియేటర్లలో ప్రభంజనం సృష్టించిన హనుమాన్ మూవీ ఓటీటీలో అంతకు మించి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

జీ5 ఓటీటీకి ఈ సినిమా కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను అందించడం మాత్రం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి. హనుమాన్ ఆలస్యంగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండటం వల్లే ఈ సినిమాకు కలెక్షన్లు మరింత పెరిగాయని సినీ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. (Hanu Man) హనుమాన్ మూవీ ప్రేక్షకులను అంచనాలను మించి మెప్పించి ఈ ఏడాది సంక్రాంతి విజేతగా నిలిచింది.

పవర్ స్టార్ నిజంగానే రూ.100 కోట్ల ఆస్తులు అమ్మారా.. ఏమైందంటే?

‘ఆపరేషన్ వాలెంటైన్’ సెన్సార్ రివ్యూ వచ్చేసింది.. రన్ టైమ్ ఎంతంటే?
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus