నిన్న విడుదలైన ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి కొంత మిక్స్డ్ టాక్ వచ్చింది అనే మాట వాస్తవం. కొన్ని మైనస్ లు ఉన్నాయి. అవి లేని సినిమా ఈ మధ్యకాలంలో ఏముంది చెప్పండి. రాజమౌళి టేకింగ్ ముందు ఈ మైనస్ లు ఏమాత్రం కనిపించవు.. ఇది అక్షర సత్యం. ఉదాహరణకి ఒక లోపం గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. అల్లూరి సీతారామరాజు పాత్రని పోషించిన చరణ్ ఈ మూవీలో 3 రకాల లుక్స్ లో కనిపిస్తాడు.
అయితే సీన్ సీన్ కు అతని లుక్ మారిపోతూ ఉంటుంది. భీమ్ ను పట్టుకోవాలి అని బ్రిటీష్ వారు పోలీసులకి ఆదేశించిన సమయంలో చరణ్ ఒత్తైన మీసాలతో కనిపిస్తాడు. ఆ తర్వాత సీన్ లో వెంటనే గడ్డం లుక్ లోకి మారిపోతాడు. చరణ్ పాత్ర ప్రాణాపాయంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ పాత్ర కాపాడుతుంది. ఆ టైములో చరణ్ గడ్డంతోనే ఉంటాడు. కానీ తర్వాత సీన్లో మళ్ళీ అతను ఒత్తైన మీసాలతో కనిపిస్తాడు.
‘ఆర్.ఆర్.ఆర్’ ప్రమోషన్లలో పాల్గొన్న టైములో నాటు నాటు పాట ఫాస్ట్ గా వేసే స్టెప్ లో ఎన్టీఆర్ మూమెంట్ మారిందని 17 టేకులు తీసుకున్నాడట రాజమౌళి. ఆయన పర్ఫెక్షన్ అలా ఉంటుంది అని ఎన్టీఆర్ ఆ సందర్భంగా చెప్పుకొచ్చాడు. మరి చరణ్ లుక్ సీన్ సీన్ కు మారిపోతుంటే రాజమౌళి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదా? పైగా 4 ఏళ్ళ నుండి మూవీ తీసాడు.
ఇలాంటివి లెక్కేసుకుంటే చాలానే ఉంటాయి. కానీ మనం మొదట్లో చెప్పుకున్నట్టు ఎన్ని లోపాలు ఉన్నా.. తన టేకింగ్ తో వాటిని కప్పిపుచ్చడంలో జక్కన్న తోపు అంతే..!
Most Recommended Video
‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?