Seetimaarr Release Date: డేట్ మార్చుకున్న గోపీచంద్!

హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నాడు గోపీచంద్. ఇప్పుడు ‘సీటీమార్’ సినిమాతో అదృష్టం పరీక్షించుకోబోతున్నారు. కబడ్డీ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో గోపీచంద్ కి జోడీగా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తోంది. అయితే రీసెంట్ గా ఈ సినిమాను సెప్టెంబర్ 3న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. నిజానికి ఈపాటికే ఈ సినిమా విడుదల కావాలి కానీ కరోనా కారణంగా ఆలస్యమైంది. అయితే ఇప్పుడు పరిస్థితులు చక్కబడుతుండడంతో సెప్టెంబర్ 3న రిలీజ్ చేయాలనుకున్నారు.

కానీ ఇప్పుడు ఈ డేట్ ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. వినాయకచవితి కానుకగా సెప్టెంబర్ 10న సినిమాను విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. గోపీచంద్ కెరీర్ లో చెప్పుకోదగిన సినిమాగా ఉండాలని ఈ సినిమాపై స్పెషల్ కేర్ తీసుకుంది చిత్రబృందం. ఈ సినిమాలో కబడ్డీ ప్లేయర్స్ కోసం దాదాపు ఏడు వందల మందిని ఆడిషన్స్ చేశారు దర్శకుడు సంపత్ నంది. ఇక ఈ సినిమాలో భూమిక,

తరుణ్ అరోరా, వెన్నెల కిషోర్ లాంటి తారలు కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి సినిమా ఆ అంచనాలకు ఎంతవరకు రీచ్ అవుతుందో చూడాలి!

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus