‘వినోదాయ చిత్తాం’ తమిళంలో మంచి విజయం అందుకున్న సినిమా. సినిమాలో నటించినందుకు, దర్శకత్వం వహించినందుకు సముద్రఖనికి మంచి పేరొచ్చింది. అయితే ఈ సినిమాను పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో తెలుగులోకి తీసుకొస్తున్నారు అనేసరికి ఆ సినిమాలో లూప్‌హోల్స్ వెతికే పనిలో పడ్డారు ఫ్యాన్స్. సినిమా మనకు ఎలా సరిపోతుంది అని కూడా లెక్కలేస్తున్నారు. మొత్తంగా లెక్కలేసి, ఈ సినిమా పవన్‌కు సరిపడదు అంటూ నెటిజన్లు అనేస్తున్నారు కూడా. కానీ సినిమా టీమ్ అన్నింటినీ సెట్ చేసే పనిలో పడిందట.
‘వినోదాయ చిత్తాం’లో సముద్రఖని టైమ్‌గా కనిపిస్తాడట. అంటే అదొక ఊహాజనిత పాత్ర అని చెప్పొచ్చు. ఇప్పడు క్యారెక్టర్‌లోనే పవన్ కల్యాణ్ నటిస్తాడు అంటున్నారు. ఇక రెండో పాత్ర అయిన తంబిరామయ్య క్యారెక్టర్‌ను సాయిధరమ్‌తేజ్ పోషిస్తున్నాడట. ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. తమిళ మాతృకకు దర్శకత్వం వహించిన సముద్రఖనినే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారట. అయితే ఈ సినిమాను తెలుగు తగ్గట్టుగా మార్చే పనిలో ఉందట టీమ్.
సినిమాకు బుర్రా సాయిమాధవ్ మాటలు రాస్తున్నారని సమాచారం. ఆయన ఆధ్వర్యంలో మార్పులు, చేర్పులు చేస్తున్నారట. ఈ క్రమంలో త్రివిక్రమ్ ఆలోచనలు కూడా ఉంటాయి అని తెలుస్తోంది. అలాంటి మార్పుల్లో భాగంగా పవన్ కల్యాణ్ పాత్రను పొడిగిస్తారట. అలాగే హీరోయిజం ఎలిమెంట్స్, స్పెషల్ పవర్స్ లాంటివి యాడ్ చేస్తారట. ఇక సాయిధరమ్ తేజ్ పాత్రకు, తంబిరామయ్య పాత్రకు వయసులో చాలా తేడా ఉంటుంది. అందుకే తమిళంలో తంబిరామయ్య పాత్రకు కూతుళ్లుగా కనిపించిన పాత్రలను ఇక్కడ తెలుగులో సాయితేజ్‌కి చెల్లెళ్లుగా చూపిస్తారట.
దీంతోపాటు తేజ్ కోసం ఓ లవ్ ట్రాక్ కూడా రాస్తున్నారట. లేదంటే సినిమాలో రొమాన్స్ ఉండదు. దాంతోపాటు యూత్ కి కనెక్ట్ అయ్యే పాయింట్స్ వస్తాయనే ఆలోచనట. సాయితేజ్‌కి ఇప్పుడు హిట్ సినిమా చాలా అవసరం. ఈ ఆలోచన కారణంగా పవన్ తన షెడ్యూల్‌లో మార్పులు చేసి మరీ ‘వినోదాయ చిత్తాం’ సినిమాను లైన్‌లోకి తీసుకొస్తున్నారని టాక్. పవన్ కల్యాణ్ లాంటి బ్యాకప్‌తో ఈ సినిమా చేస్తే మంచి ఫలితం వస్తుందని ఆలోచన అట. చూద్దాం మార్పులు ఎంతవరకు ఫలిస్తాయో, ప్రేక్షకుల్ని ఈ సినిమా ఎలా మెప్పిస్తుందో.
Most Recommended Video
‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!