క్యారక్టర్ ఆర్టిస్ట్ హేమ కి 300 కోట్ల ఆస్ధి, బి.ఎం.డబ్ల్యూ, కార్లు…?

తాజాగా ప్రముఖ నటి హేమ ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆస్తి కి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలిపింది. ఇందులో హేమ తన 300 కోట్ల ఆస్థి పై ఇచ్చిన క్లారిటీ ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ఈ ఇంటర్వ్యూలో… సినిమాలలో అమ్మ పాత్రలు , వదిన పాత్రలు, కమెడియన్ పాత్రలు చేసే హేమకు బీఎండబ్ల్యూ కార్లు అనేక ప్లాట్లు ఎలా వచ్చాయి అని యాంకర్ అడిగిన ప్రశ్నకు షాకింగ్ ఆన్సర్స్ ఇచ్చింది హేమ.

ఈ ప్రశ్నకి హేమ సమాధానమిస్తూ… “నాకు 300 కోట్ల వరకు ఆస్థి ఉందని చాలామంది అనుకుంటున్నారు… నిజానికి ఆ వార్తలు ఎలా వచ్చాయో నాకు తెలీదు. నా తన తల్లి కుటుంబం బాగా ధనవంతులు కావడంతో ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఒంటి నిండా బంగారు నగలతో షూటింగ్ కు వచ్చేదాన్ని. మాకు చాలా వ్యాపారాలు కూడ ఉన్నాయి. అప్పట్లో పూరి జగన్నాథ్, కృష్ణవంశీ వంటి డైరెక్టర్లు అసిస్టెంట్ డైరెక్టర్లుగా ఉన్నప్పుడు నేను నా భర్తకు తెలియకుండా వారికి డబ్బు అప్పుగా ఇచ్చాను. ఇక తిరుపతి వెళ్ళి తల నీలాలు ఇస్తే దీనికి కూడా వేరే అర్ధాలు సృష్టిస్తూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. ప్రస్తుతం నేను డబ్బు గురించి నటించడం లేదు… కేవలం నాకు పేరు తీసుకొచ్చే పాత్రల గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. నిన్నకాక మొన్నొచ్చిన ‘మేల్ కమెడియన్’ ఆర్టిస్టులకు రెమ్యూనరేషన్ బాగా ఇస్తున్నారు.. కానీ ‘ఉమన్ కమెడియన్’ పాత్రలు పోషించే వారికి మాత్రం రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం చాలా అన్యాయం జరుగుతుంది…” అంటూ హేమ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus