Charmee Kaur: ఓటీటీ వాళ్లు ఇస్తామన్నప్పుడు తీసుకుంటే అయిపోయేదిగా!

  • August 25, 2022 / 10:53 PM IST

నమ్మకం.. నమ్మకం.. నమ్మకం.. నమ్మకమే లేకుంటే వేరేది. ఈ పాట మీకు గుర్తుండే ఉంటుంది. ఓ వ్యక్తి మీద నమ్మకం చాలా అవసరమని చెప్పే ఓ సీరియల్‌లోని పాట ఇది. అయితే ఆ నమ్మకం అతినమ్మకం అయ్యి దెబ్బకొడితే.. దాని నుండి కోలుకోవడానికి చాలా ఏళ్లు పడుతుంది. ఒక్కోసారి కోలుకోవడమూ కష్టమే. ఇప్పుడు ఛార్మి, పూరి జగన్నాథ్‌ ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. ‘లైగర్‌’ ఫలితమే ఈ మాట అనుకోవడానికి కారణం.

ఏంటి.. సినిమా విడుదలై ఒక్క రోజే అయ్యింది. అప్పుడు సినిమాకు లాస్‌లు వస్తాయని ఎలా ఫిక్స్ అవుతున్నారు అని అంటున్నారా. మీరు చెప్పింది నిజమే. సినిమా వచ్చి ఒక్క రోజే అయ్యింది. అయితే ఈ రోజు వచ్చి టాక్‌లో ఎక్కడ కూడా ఒక్కపైగా హిట్‌, మంచి వసూళ్లు వస్తాయి అనే నమ్మకం కనిపించడం లేదు. యునానిమస్‌గా ఈ సినిమా ఫట్‌ అంటూ సోషల్‌ మీడియాలో, సినిమా జనాల్లో మాటలు వినిపిస్తున్నాయి. పెట్టింది రావడం కూడా కష్టమే. విజయ్‌ కోసం జనాలు సినిమాకు వెళ్తే కాస్త డబులు వస్తాయి అని చెబుతున్నారు.

దీంతో సినిమా ప్రచారంలో భాగంగా ఛార్మి చెప్పిన ఓ మాట ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. సినిమా కోసం విజయ్‌ దేవరకొండ, పూరి జగన్నాథ్‌ను ఓ ప్రత్యేక ఇంటర్వ్యూ చేసిన విషయం తెలిసిందే. అందులో ‘లైగర్‌’కి ఓ ఓటీటీ నుండి రూ. 200 కోట్ల ఆఫర్ వచ్చిందని.. అయినా ఒప్పుకోలేదని ఘనంగా చెప్పుకొచ్చింది ఛార్మి. అంతేకాదు తాము ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణం విజయ్‌ దేవరకొండ మీద నమ్మకం అని చెప్పింది. దాంతోపాటు సినిమా కథాంశం మీద ఉన్న నమ్మకం కూడా అని చెప్పింది.

తీరా సినిమా ఇప్పుడు చూస్తే.. మొత్తంగా పరిస్థితి మారిపోయింది. ఏ మూల నుండి కూడా ఒక్క పాజిటివ్‌ రెస్పాన్స్‌ రావడం లేదు. ఎటు చూసినా సినిమా ఫలితం తేడా కొట్టింది అనే మాటే వినిపిస్తోంది. విజయ్‌ బాగానే చేసినా.. పూరి జగన్నాథ్‌ దెబ్బకొట్టారు అని అంటున్నారు. కథ, కథనం, టేకింగ్‌, కాస్టింగ్‌.. ఇలా అన్నింటా విఫలమయ్యారు అని అంటున్నారు. ఈ లెక్కన పూరి జగన్నాథ్‌ మీద ఛార్మి పెట్టుకున్న నమ్మకం (అతి నమ్మకం) పెద్ద దెబ్బే కొట్టింది అని చెప్పాలి. ఓటీటీ డీల్‌కి ఓకే అనేసుంటే రూ. 200 కోట్లు వచ్చేవి.

ఇక విజయ్‌ అయితే సినిమా వసూళ్లు రూ. 200 కోట్ల నుండి లెక్కెడతా అని సినిమాకు ఓవర్‌ హైప్‌ ఇచ్చాడు. అంటే రూ. 200 కోట్లకుపైగా సినిమా వసూళ్లు ఉంటాయి అని చెప్పాడు. దీంతో వాళ్ల మాటలే వారిని ఇబ్బంది పెట్టాయి అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆఖరిగా అతి నమ్మకం పనికిరాదు. అతి ఆశ కూడా పనికిరాదు. సినిమాల్లో ఇది మరీనూ. దీని నష్టం ‘లైగర్‌’ టీమ్‌కి రూ. 200 కోట్లు. ఈ మాట మేం అనడం లేదు. ఛార్మి చెప్పిన లెక్కే ఇది.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus