Chatrapathi Collections: ‘ఛత్రపతి’ కి 19 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే ?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ రాజమౌళి (S. S. Rajamouli) ..ల కలయికలో తెరకెక్కిన మొదటి చిత్రం ‘ఛత్రపతి’ (Chatrapathi) . ‘అడవి రాముడు’ (Adavi Ramudu) ‘చక్రం’ (Chakram) వంటి ఫ్లాపుల తర్వాత ప్రభాస్ చేసిన ఈ సినిమా పై మొదట పెద్దగా అంచనాలు లేవు. శ్రియ (Shriya Saran) హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి కీరవాణి (M. M. Keeravani) సంగీతం అందించారు. ‘శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర’ బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ (B. V. S. N. Prasad) నిర్మించారు. 2005 సెప్టెంబర్ 30 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Chatrapathi Collections

మొదటి షోతోనే ఈ మూవీ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. కాట్ రాజ్ ఫైట్, ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్స్..లు మాస్ ఆడియన్స్ కి అమితంగా నచ్చేశాయి. అయితే ఫుల్ రన్లో ఈ చిత్రం (Chatrapathi) ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 5.58 cr
సీడెడ్ 2.54 cr
ఉత్తరాంధ్ర 1.66 cr
ఈస్ట్ 1.08 cr
వెస్ట్ 0.93 cr
గుంటూరు 1.27 cr
కృష్ణా 1.11 cr
నెల్లూరు 0.73 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 14.90 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 1.45 Cr
వరల్డ్ వైడ్ (టోటల్) 16.35 cr

‘ఛత్రపతి’ చిత్రం రూ.10.2 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగారు. ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.16.35 కోట్ల షేర్ ను రాబట్టింది. మొత్తంగా బయ్యర్లకి రూ.6.15 కోట్ల వరకు లాభాలు అందించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది ‘ఛత్రపతి’.దీని తర్వాత ప్రభాస్ – రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన ‘బాహుబలి'(సిరీస్) అయితే చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.

ఆ పాత్రలలో నటించే ఛాన్స్ లేదంటున్న జాన్వీ కపూర్.. ఏం చెప్పారంటే?

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus