Che Movie: సెన్సార్ పూర్తి చేసుకున్న ‘చే’.. ఎలా ఉందంటే?

టాలీవుడ్లో రూపొందుతున్న మరో క్రేజీ అండ్ ఇంట్రెస్టింగ్ బయోపిక్ ‘చే’. క్యూబా పోరాట యోధుడైన చేగువేరా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఆయన గురించి చాలా మంది కథలు కథలుగా చెప్పుకుంటారు. కొంతమంది పుస్తకాల రూపంలో,ఇంకొంతమంది పలు హాలీవుడ్ సినిమాలు చూసి ఆయన గురించి తెలుసుకున్నారు. అయితే ఆయన గురించి సినిమా ద్వారా అందరికీ తెలియజేయాలని ‘చే’ మూవీని రూపొందిస్తున్నారు. ‘చే’ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘లాంగ్ లైవ్’ అనేది ఉప శీర్షిక.

‘నవ ఉదయం’ సమర్పణలో ‘నేచర్ ఆర్ట్స్ బ్యానర్‌’ పై ఎస్.సూర్య,ఎస్.బాబు, ఎస్.దేవేంద్ర ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. బీఆర్ సభావత్ నాయక్ టైటిల్ రోల్ పోషిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు.లావణ్య సమీరా, పూల సిద్దేశ్వర్, కార్తీక్ నూనె, వినోద్, పసల ఉమా మహేశ్వర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రవిశంకర్ సంగీత దర్శకుడు. ఈ చిత్రం ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ను రాబట్టుకోవడమే కాకుండా సినిమా చూడాలనే క్యూరియాసిటీని కూడా క్రియేట్ చేసింది.

ఈ క్రమంలో సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది (Che Movie) ‘చే’ మూవీ. ఈ చిత్రం చూసిన సెన్సార్ వారు ఎటువంటి కట్స్ లేకుండా యు/ఎ సర్టిఫికెట్ ను జారీ చేశారు. అలాగే ఇందులోని ఎమోషనల్ కంటెంట్ అందరినీ ఆకట్టుకునే విధంగా ఉందట. అలాగే చాలా ఇన్స్పిరేషన్ గా కూడా ఉందని అంటున్నారు. ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని తప్పకుండా చూడాలని, తప్పకుండా అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటుందని అంటున్నారు.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus