Samantha: అలాంటి చెత్త పబ్లిసిటీ సామ్ కు అక్కర్లేదు.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే!

స్టార్ హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమంత ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య 3.5 కోట్లు అంటే ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో సులువుగా అర్థమవుతుంది. అయితే సమంత ఇన్ స్టాగ్రామ్ స్టోరీ చుట్టూ చీప్ పాలిటిక్స్ జరుగుతూ నెట్టింట కొన్ని చెత్త వార్తలు వైరల్ అవుతున్నాయి. సమంత తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఆరోగ్యానికి సంబంధించిన ఒక ఫోటోను పంచుకుంది.

అయితే ఆ ఫోటోకు కొనసాగింపుగా ఒక చెత్త ఫోటోను పంచుకుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. అయితే వాస్తవానికి సెలబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలను వాళ్లు హ్యాండిల్ చేయరు. ఏ పోస్ట్ పెట్టినా ఏ ఫోటో షేర్ చేసినా ఒకటికి పదిసార్లు చెక్ చేసుకుని ఫోటో షేర్ చేయడం జరుగుతుంది. సమంతకు ఇప్పటికీ ఊహించని స్థాయిలో ఆఫర్లు వస్తున్నాయనే సంగతి తెలిసిందే. సమంతకు కెరీర్ పరంగా మరికొన్ని సంవత్సరాల పాటు ఢోకా లేదు.

చెత్త పబ్లిసిటీతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవ్వాల్సిన అవసరం సమంతకు లేదని ఫ్యాన్స్ సైతం వాదిస్తున్నారు. వైరల్ అవుతున్న ఫోటో డీప్ ఫేక్ ఫోటో లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేసిన ఫోటో లేదా ఎవరి ఫోటోనో అయ్యి ఉండవచ్చని ఫ్యాన్స్ చెబుతున్నారు. సమంత నుంచి సైతం ఇందుకు సంబంధించి క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

ఏ తప్పు చేయకపోయినా సమంతనే టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మరి కొందరు చెబుతున్నారు. సమంత రేంజ్, క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే లెవెల్ అని ఆమె లీగల్ గా వెళ్తే మాత్రం తప్పుడు ప్రచారం చేసేవాళ్లకు ఇబ్బందులు తప్పవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సమంత పారితోషికం 3 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉండగా సమంతకు పూర్వ వైభవం రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus