Shilpa Shetty: కోట్ల రూపాయల మోసం.. శిల్పాపై పోలీస్ కంప్లైంట్!

పోర్నోగ్రఫీ కేసులో శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు శిల్పాశెట్టిని కూడా ప్రశ్నించారు. ప్రస్తుతానికైతే ఆమెకి ఈ కేసుతో ఎలాంటి సంబంధాలు లేవని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. తాజాగా శిల్పాశెట్టి, ఆమె తల్లి సునంద శెట్టిలపై లక్నోలోని రెండు పోలీస్ స్టేషన్ లలో చీటింగ్ కేసు నమోదైంది. శిల్పా, ఆమె తల్లి సునంద తమ వద్ద కోట్ల రూపాయలు తీసుకొని మోసం చేశారంటూ జ్యోత్స్న చౌహాన్,

రోహిత్ వీర్ సింగ్ అనే ఇద్దరు వ్యక్తులు పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వారు ఫిర్యాదు మేరకు పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టారు. ఇప్పటికే శిల్పాను, ఆమె తల్లిని విచారించడానికి ఒక బృందం ముంబైకి చేరుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అయోసిస్ వెల్ నెస్ అండ్ స్పా పేరుతో శిల్పాశెట్టి ఫిట్ నెస్ సెంటర్ ను నడిపిస్తుంది. దీనికి ఆమె చైర్మన్ గా ఉండగా.. ఆమె తల్లి సునంద డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.

ఈ ఫిట్ నెస్ సెంటర్ మరో బ్రాంచ్ ను లక్నోలో ప్రారంభించడానికి జ్యోత్స్న చౌహాన్‌, రోహిత్‌ వీర్‌ సింగ్‌ అనే ఇద్దరికి ఫ్రాంచైజ్ ఇచ్చి.. సెంటర్ ను మొదలుపెట్టడానికి వారి దగ్గర నుండి కోట్లలో డబ్బు తీసుకున్నారు. ఆ తరువాత దీనిపై వారి నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో శిల్పా, ఆమె తల్లి సునంతాలు తమ వద్ద డబ్బులు తీసుకొని మోసం చేశారంటూ పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం పోలీసులు విచారణ చేపట్టారు.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus