Shilpa Shetty: రూ.60 కోట్ల చీటింగ్.. శిల్పా శెట్టి దంపతుల పై కేసు

హీరోయిన్ శిల్పా శెట్టి అలాగే ఆమె భర్త రాజ్ కుంద్రా.. నిత్యం ఏదొక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. మొన్నామధ్య నీలి చిత్రాల కేసుతో చాలా కాలం వార్తల్లో నిలిచారు. తర్వాత ఐటీ దాడులు… ఇలా ఈ జంట ఎక్కువగా వివాదాలతో హాట్ టాపిక్ అయిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు వీరిపై ఛీటింగ్ కేసు నమోదవడంతో.. వీళ్ళ పేర్లు మళ్ళీ మార్మోగుతున్నాయి. విషయంలోకి వెళితే.. ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్త శిల్పా శెట్టి దంపతులపై రూ.60 కోట్ల చీటింగ్ కేసు పెట్టాడు.

Shilpa Shetty

గతంలో బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని టేకప్ చేశారు శిల్పా శెట్టి దంపతులు. ఆ టైంలో దీని డెవలప్మెంట్ కోసం రూ.60 కోట్లు ఇన్వెస్ట్ చేశాడట. కానీ దాన్ని ఆ కంపెనీ కోసం కాకుండా తమ సొంత ఖర్చుల కోసం వాడుకున్నారని, తర్వాత ఆ డబ్బును తిరిగి చెల్లించలేదని ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలుస్తుంది. 2015 ఆ టైంలో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాలు ‘బెస్ట్ డీల్ టీవీ’ సంస్థకు డైరెక్టర్లుగా ఉన్నారు.

అందులో 87 శాతం వాటా శిల్పా శెట్టి పేరిట ఉండేదట. అయితే తర్వాత బెస్ట్ డీల్ టీవీ కంపెనీ దివాళా తీసింది. తర్వాత ఆ వ్యాపారవేత్తకి చెల్లించాల్సిన మొత్తాన్ని ఈ దంపతులు చెల్లించకుండా తిరుగుతున్నారని అతని ఫిర్యాదుని బట్టి అర్థం చేసుకోవచ్చు.

బాధితుడు జూహూ పోలీస్ స్టేషన్‌లో ఫోర్జరీ, ఛీటింగ్ కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. మరోపక్క శిల్పా శెట్టి దంపతులు ఇవి అసత్య ఆరోపణలు అంటూ కొట్టిపారేస్తున్నారు. దీనికి ఎటువంటి ఆధారాలు లేవు అంటూ శిల్పా శెట్టి లీగల్ టీం కూడా వాదిస్తున్నట్టు తెలుస్తుంది.

‘వార్ 2’ మూవీ తెలుగు థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus