సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ఇండియా తరపున అధికారికంగా ఆస్కార్ రేసులో నిలిచిన గుజరాతీ చిత్రం ‘ఛెల్లో షో’ లో చైల్డ్ ఆర్టిస్ట్ మృతి చెందడం అందరినీ విషాదంలోకి నెట్టినట్టు అయ్యింది. ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన సమయ( భవిన్ రాబారి) కి స్నేహితుడుగా నటించాడు ఇతను. ఇతని పేరు రాహుల్ కోలి.ఇతని వయసు 15 సంవత్సరాలు మాత్రమే.ఇతను క్యాన్సర్తో ఫైట్ చేసి మరణించినట్టు తెలుస్తుంది.
కాగా, రాహుల్ మరణించిన విషయాన్ని అతని తండ్రి తెలిపారు. చనిపోయేముందు రాహుల్ తీవ్ర జ్వరంతో బాధపడినట్లు పేర్కొన్నాడు. ఆయన మాట్లాడుతూ… “ఆదివారం అక్టోబర్ 2న, అతడు టిఫిన్ చేశాక తీవ్ర జ్వరం బారిన పడ్డాడు. మూడు సార్లు రక్తపు వాంతులు చేసుకున్నాడు. అటు తర్వాత అతను చనిపోయాడు. మా కుటుంబం ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతుంది. మేము అక్టోబర్ 14న విడుదల కానున్న అతడి ‘ఛెల్లో షో’ సినిమాను చూసిన తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తాం” రాహుల్ తండ్రి చెప్పుకొచ్చారు.
రాహుల్ కోలి చాలా కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇతనికి మెరుగైన వైద్యం అందించలేకపోయారని స్పష్టమవుతుంది. ఇక ఈ ‘ఛెల్లో షో’ చిత్రం అక్టోబరు 14న ‘లాస్ట్ ఫిల్మ్ షో’గా ఇంగ్లిషులో విడుదలవుతోంది. ఈ సినిమా ఉత్తమ విదేశీ చిత్ర విభాగంలో పోటీ పడనుంది. “ప్రతిష్ఠాత్మక 95వ అకాడమీ అవార్డుల చిత్రోత్సవాల్లో మా సినిమా బరిలో ఉండటంతో చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు.
దీన్ని ‘లాస్ట్ ఫిల్మ్ షో’గా గురువారం రోజున 95 థియేటర్లలో విడుదల చేయబోతున్నాం. రూ.95లకే టికెట్ ధరను అందుబాటులో ఉంచుతున్నాం’ అంటూ దర్శకుడు పాన్ నళిన్ తాజాగా ఓ ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే.రాయ్‌కపూర్ ఫిల్మ్స్, జుగాడ్ మోషన్ పిక్చర్స్ పతాకాలపై సిద్ధార్థ్ కపూర్, ధీర్ మోమయా నిర్మించారు. అయితే ‘రాహుల్ ఈరోజు మా మధ్య లేకపోవడం నిజంగా దురదృష్టకరం’ అంటూ చిత్ర బృందం చింతించింది.
Most Recommended Video
నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!