బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ (Vicky Kaushal), నేషనల్ క్రష్ రష్మిక మందన (Rashmika Mandanna) హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘ఛావా'(Chhaava). లక్ష్మణ్ ఉటేకర్ (Laxman Utekar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 14న హిందీలో రిలీజ్ అయ్యింది. ఛత్రపతి శివాజీ, శంభాజీ..ల జీవిత కథతో తెరకెక్కిన ఈ సినిమా.. అక్కడ రూ.600 కోట్లకి పైగా వసూళ్లు సాధించింది. దీంతో టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) తెలుగులో కూడా ఈ సినిమాని డబ్ చేసి ‘గీతా ఆర్ట్స్’ సంస్థపై రిలీజ్ చేయించారు.
మార్చి 7న తెలుగు వెర్షన్ రిలీజ్ అయ్యింది. ఇక్కడ కూడా మంచి వసూళ్లను సాధించి బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇప్పటికీ నిలకడగా రాణిస్తుంది అని చెప్పాలి. ఒకసారి 6 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 1.56 cr |
సీడెడ్ | 0.58 cr |
ఉత్తరాంధ్ర | 0.68 cr |
ఈస్ట్ | 0.17 cr |
వెస్ట్ | 0.11 cr |
గుంటూరు | 0.19 cr |
కృష్ణా | 0.27 cr |
నెల్లూరు | 0.10 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 3.66 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.36 cr |
వరల్డ్ వైడ్ టోటల్ (టోటల్) | 4.02 cr |
‘ఛావా’ చిత్రానికి రూ.2.26 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.2.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా 6 రోజుల్లో రూ.4.02 కోట్ల షేర్ ను రాబట్టింది. ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.1.52 కోట్ల లాభాలు అందించింది.