Salaar: సలార్ మూవీ అప్ డేట్స్ ఇచ్చిన చైల్డ్ ఆర్టిస్ట్.. ఏం చెప్పారంటే?

ఈ ఏడాది థియేటర్లలో విడుదల కానున్న సినిమాలలో అత్యంత భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడిన సినిమా ఏదనే ప్రశ్నకు సలార్ సినిమా పేరు సమాధానంగా వినిపిస్తుంది. సలార్ సినిమాకు సంబంధించి వస్తున్న ప్రతి అప్ డేట్ ప్రభాస్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చేలా ఉందనే సంగతి తెలిసిందే. ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన చైల్డ్ ఆర్టిస్ట్ ఆదేశ్ ఆసక్తికర విషయాలను వెల్లడించడం గమనార్హం. అఖండ, బంగార్రాజు, సలార్ సినిమాలలో నటించిన ఆదేశ్ మాట్లాడుతూ ప్రభాస్ కు చిన్నప్పటి ఫ్రెండ్ రోల్ లో నేను కనిపిస్తానని నా పార్ట్ కు సంబంధించిన షూట్ ఇంకా బ్యాలెన్స్ ఉందని ఆదేశ్ చెప్పుకొచ్చారు.

ప్రభాస్ సార్ తో ఎక్కువగా మాట్లాడలేదని మేము ట్రాక్టర్ పైన కూర్చుంటామని సినిమాలో మేము డైలాగ్స్ చెప్పే సీన్ బాగుంటుందని ఆయన కామెంట్లు చేశారు. మూవీ ఆఫర్లతో బిజీగా ఉన్నానని ఆదేశ్ చెప్పుకొచ్చారు. సలార్ లో చిన్నప్పటి ప్రభాస్ ను కూడా చూపిస్తారని తెలిసి ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. సలార్ టీజర్ లో ఎన్నో క్లూస్ ను ప్రశాంత్ నీల్ ఇచ్చారు. సలార్ టీజర్ కు ఇప్పటివరకు 84 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

ప్రభాస్ సలార్ (Salaar) మూవీ ఓపెనింగ్స్ విషయంలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సలార్ టీజర్ ను చూసిన వాళ్లే మళ్లీ చూస్తుండటం గమనార్హం. టీనూ ఆనంద్ ట్రైలర్ లో చెప్పిన డైలాగ్స్ సైతం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. టీనూ ఆనంద్ రోల్ కూడా సినిమాలో కీలకమని తెలుస్తోంది. సలార్ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కనుంది.

ప్రశాంత్ నీల్ తన డైరెక్షన్ లో తెరకెక్కే ప్రతి సినిమాను రెండు లేదా మూడు భాగాలుగా తెరకెక్కిస్తున్నారని సమాచారం అందుతోంది. సలార్ మూవీ రెమ్యునరేషన్ల కోసమే 150 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఖర్చైందని తెలుస్తోంది.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus