Chinmayi, Samantha: సమంత గొప్పదనం గురించి రివీల్ చేసిన చిన్మయి.. ఏం చెప్పారంటే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత ఖుషి సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు. ఫస్ట్ వీకెండ్ లో ఖుషి రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించింది. కొన్ని ఏరియాలలో ఖుషి మూవీ ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయిందని సమాచారం అందుతోంది. అయితే సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి సమంత గొప్పదనం గురించి చెబుతూ కీలక వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఎన్ని నిందలు ఎదురైనా హుందాగా ఏ విధంగా ముందుకు సాగాలో సమంతను చూసి నేర్చుకోవాలని చిన్మయి తెలిపారు. సమంత అనారోగ్యం వల్ల ఒక సినిమా ఆలస్యమైందని ఆ సినిమా కోసం సమంత తన రెమ్యునరేషన్ తగ్గించుకుందని వచ్చే డబ్బును వద్దనుకునే వాళ్లు ఈ కాలంలో ఎంతమంది ఉంటారో నాకు తెలియదని ఆమె తెలిపారు. సోషల్ మీడియాలో నెగిటివిటీ వచ్చిన సమయంలో సమంత మయోసైటిస్ గురించి చెప్పారని చిన్మయి అన్నారు.

సమంత కెరీర్ అయిపోయిందని కొంతమంది కామెంట్లు చేస్తుంటే సామ్ మాత్రం బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కు వెళ్లి సత్తా చాటుతోందని చిన్మయి కామెంట్లు చేశారు. ఎవరు ఎన్ని విధాలుగా దూషించినా, అసభ్యంగా కామెంట్లు చేసినా వాటిని పట్టించుకోకుండా సమంత కెరీర్ విషయంలో ముందడుగులు వేస్తున్నారని చిన్మయి చెప్పుకొచ్చారు. కర్మ సిద్ధాంతం అనేది ఆసక్తికర అంశం అని చిన్మయి (Chinmayi) కామెంట్లు చేశారు.

ఒకరి గురించి అదే పనిగా నిందలు వేస్తూ అబద్ధాలు చెబుతూ దూషిస్తే ఆ పాపం ఏదో ఒకరోజు మనకే ఎదురు తిరుగుతుందని చిన్మయి అన్నారు. డబ్బులు సంపాదించినా ఆస్తులు ఉన్నా ఎలాంటి లాభం మాత్రం లేదని ఆమె అన్నారు. తరతరాలకు ఆ కర్మ ఫలం వర్తిస్తుందని ఆమె చెప్పుకొచ్చారు. ఒక ఒక్కసారి మొదలైతే వినోదం మామూలుగా ఉండదని చిన్మయి తెలిపారు. చిన్మయి చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

ఖుషి సినిమా రివ్యూ & రేటింగ్!

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!
బిగ్ బాస్ సీజన్ – 7 ఎలా ఉండబోతోందో తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus