Chinmayi Sripaada: మీరాకు సపోర్ట్‌పై చిన్మయి క్లారిటీ!

రెండేళ్ల క్రితం అనుకుంటా… ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మది శ్రీపాద మీద బీభత్సంగా ట్రోలింగ్‌ జరిగింది. అప్పటికే సోషల్‌ మీడియాలో వివిధ అంశాల విషయంలో ఆమె యాక్టివ్‌గా స్పందిస్తుండేవారు. ఈ క్రమంలో నాయిక మీరా చోప్రాకు ఓ విషయంలో ఆమె సపోర్టు చేశారు. దీంతో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఆమెను బాగా ట్రోల్‌ చేశారు. ఆ రోజుల్లో ఈ విషయం కంప్లయింట్స్‌ వరకు వెళ్లింది. తాజాగా ఈ విషయమై చిన్మయి మాట్లాడింది.

ప్ర‌ముఖ పాట‌ల ర‌చ‌యిత వైర‌ముత్తు, సింగ‌ర్ కార్తీక్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసి సింగ‌ర్ చిన్మ‌యి అప్పట్లో పెద్ద సంచలనానికే దారి తీసింది. మహిళలకు జరుగుతున్న అన్యాయాల గురించి ఆమె మీటూ అంటూ గొంతు కలిపింది. దీంతో ఆ రోజుల్లో ఆమెకు సపోర్టుగా కొందరు, అపోజ్‌ చేస్తూ మరికొందరు నిలిచారు. ఇదే సమయంలో నాయిక మీరా చోప్రా ఓ సందర్భంగా జూనియర్‌ ఎన్టీఆర్‌ ఎవరో తనకు తెలియదు అని చెప్పింది.

దాంతో ఎన్టీఆర్‌ అభిమానులు అంటూ కొంతమంది ఆమెను మాటలతో ఇబ్బందిపెట్టారు. దీంతో మీరా చోప్రాకు చిన్మయి సపోర్టుగా నిలిచారు. మీరా చోప్రాను కొంతమంది అలా అనడం సరికాదు అంటూ వాదించారు. దీంతోను ఆమెను కూడా ట్రోల్‌ చేయడం మొదలుపెట్టారు. చినుకుల్లా మొదలైన ఈ అలజడి తుపాను అయ్యింది. దీనిపై తాజాగా చిన్మయి మాట్లాడారు. అప్పుడు ఎందుకు అలా మీరా చోప్రాకు సపోర్టు చేసింది, ఆలోచన వెనుక ఏముంది అనే విషయాలు వెల్లడించారు.

‘‘స‌మ‌స్య‌ల‌పై ఎదురు తిరిగిన‌ప్పుడు విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నాను. బూతులు కూడా తిట్టారు. ఆ సమయంలో నేను అప్ సెట్ కాలేదు. ఎందుకంటే అది వాళ్ల మ‌న‌స్త‌త్వాన్ని తెలియజేస్తుంది. ఫ్యాన్ వార్స్ చూస్తుంటే షాకింగ్‌గా ఉంటుంది. ఇవ‌న్నీ వాళ్లు చేస్తున్నార‌ని వాళ్ల త‌ల్లిదండ్రుల‌కు తెలుసా! అనే డౌట్ వ‌స్తుంటుంది. స్టార్ వార్‌లో వాళ్లు ఆడ‌వాళ్ల‌ని టార్గెట్ చేస్తుంటారు. అదెందుకో నాకు అర్థం కాదు’’ అని చిన్మయి అన్నారు.

‘‘హీరో మీద అభిమానులకు ఉన్న ప్రేమ‌ను అర్థం చేసుకోగ‌ల‌ను. అయితే ఇత‌రుల‌ను దూషించ‌టం సరికాదు. ఎవరికైనా ఏదైనా విషయం, ఎవరైనా వ్యక్తి తెలియ‌దంటే త‌ప్పేం కాదు. తెలియ‌ని విష‌యాన్ని త‌ర్వాత తెలుసుకుంటారు. దానికే ట్రోలింగ్‌ చేయడం, వ్యక్తిగతంగా దూషించడం సరికాదు’’ అని ‘మీరా చోప్రా X ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ అంటూ ట్రోల్‌ చేసిన వారి’ మధ్య జరిగిన అంశం, తన ప్రమేయం గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు చిన్మయి.

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus