పాపం చిన్మయి టైం ఏమీ బాగున్నట్టు లేదు. మొన్నటికి మొన్న ‘మన్మధుడు2’ టీజర్ ను షేర్ చేసినందుకు నెటిజన్లు ఆమెను విపరీతంగా ట్రోల్ చేసారు. ‘మీటూ’ ఉద్యమంలో భాగంగా చిన్మయి చేసిన ట్వీట్లను గుర్తుచేసి మరీ ట్రోల్ చేసారు ఈమెని..! ఇదిలా ఉండగా ఇప్పుడు ఈమెకు… అభిమానినంటూ ఓ నెటిజన్ మెసేజ్ చేసాడు. దీనికి చిన్మయి రెస్పాండ్ అవ్వకపోవడంతో అసభ్యకర పదజాలంతో మెసేజ్ లు పంపాడట. చివరిల్లో ఇలా మాట్లాడితే రిప్లై ఇస్తారని ఆశించానని కూడా రాసుకొచ్చాడట.
ఆ సందేశాల్ని చిన్మయి స్క్రీన్‌షాట్ తీసి షేర్ చేస్తూ.. ‘రిప్లై ఇవ్వకపోతే అభిమాని ఇలాంటి మెసేజ్‌లు చేస్తాడా?’ అంటూ ట్వీట్ చేసింది. దీన్ని చూసిన మరో నెటిజన్ .. ‘ఓ ఫ్యాన్‌కు చిరాకు వచ్చే వరకూ ఎదురుచూసి, తర్వాత ఆ మెసేజ్‌లను షేర్ చేసేందుకు మీకు సమయం ఉంది. కానీ హాయ్.. థాంక్యూ అని రిప్లై ఇవ్వడానికి సమయం లేదా?’ అంటూ ప్రశ్నించాడు. దీనికి చిన్మయి బదులిస్తూ.. ‘నాకు రోజుకు వెయ్యి మెసేజ్‌లు వస్తాయి. ఇక్కడ కూర్చుని ప్రతి ఒక్కరికీ రిప్లై ఇవ్వడం నా పనికాదు’ అంటూ ఘాటుగా సమాధానమిచ్చింది.’ఏదేమైనా సెలబ్రిటీలకు కూడా చాలా పనులుంటాయి.. ఇలా మెసేజ్ లు కొడుతూ కూర్చునే సమయం వారికుంటుందా?’ అంటూ చిన్మయికి సపోర్ట్ చేస్తున్న వారు కూడా ఉన్నారు.