దివంగత స్టార్ యాక్టర్ కోట శ్రీనివాసరావు భార్య కోట రుక్మిణి మృతి చెందారు. చాలా కాలం నుండి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వస్తున్న ఈమె… ఇటీవల భర్త కోట శ్రీనివాసరావు చనిపోవడంతో ఒంటరితనం ఫీలవుతూ బెంగతో ఆరోగ్యాన్ని మరింతగా పాడు చేసుకున్నారు. ఇక ఈరోజు ఆమె హఠాన్మరణం చెందినట్టు తెలుస్తోంది. రుక్మిణి వయస్సు 75 ఏళ్ళు అని తెలుస్తుంది.
ఆగస్టు 18న అనగా ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో రుక్మిణి కన్నుమూసినట్టు సమాచారం. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు మీడియాకి తెలియపరిచారు.1966లో కోటా శ్రీనివాసరావుతో రుక్మిణి వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కూతుర్లు, కొడుకు సంతానం. అయితే దురదృష్టవశాత్తు 2010 లో కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
అయితే కోటా కుటుంబానికి శాపం తగిలింది అని ఇండస్ట్రీలో కొంత మంది గతంలో ఆయన సన్నిహితులు ఆయనకి చెప్పడం జరిగిందట. అందుకు శాంతి మార్గం కూడా బోధించారట. స్వతహాగా బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కోటా.. ఎందుకో అలాంటి వాటిని లెక్కచేయలేదని ఆయన సన్నిహితులు బంధువులు చెప్పుకొస్తున్నారు. కొడుకు మరణం తర్వాత కోటా శ్రీనివాసరావు మానసికంగా కుంగిపోయారు. అనారోగ్య సమస్యలు కూడా పెరిగిపోయాయట. అటు తర్వాత ఆయనలో శక్తి లోపించిందని భావించి.. దర్శక నిర్మాతలు ఆయనకు అవకాశాలు ఇవ్వడం తగ్గించినట్టు చెబుతున్నారు. తర్వాత ఆర్థికంగా కూడా కోటా కుటుంబం చాలా ఇబ్బంది పడిందట. కొంతవరకు ఆస్తులు కూడా అమ్ముకోవాల్సి వచ్చిందని అంటున్నారు. మరోపక్క కోటా శ్రీనివాసరావు సోదరుడు కోటా శంకరరావు కూడా ఫేడౌట్ అయ్యి చాలా కాలం అయ్యింది.