న్యూయార్క్‌లో జరిగిన ది వరల్డ్ లార్జెస్ట్ ఇండియా డే కవాతుకు ఏటా సినిమా పరిశ్రమ నుండి స్టార్‌లను పిలుస్తూ ఉంటారు. తొలుత బాలీవుడ్ జనాలను, ఇతర పరిశ్రమల్లోని స్టార్ హీరోలను పిలుస్తూ వచ్చారు. వారికి గ్రాండ్ మార్షల్ అనే పేరు కూడా ఇస్తారు. ఈ ఏడాది ఈ గౌరవం కథానాయిక రష్మిక మందన, కథానాయకుడు / నిర్మాత విజయ్ దేవరకొండకు దక్కింది. వీళ్లిద్దరూ ఇటీవల జరిగిన ఈవెంట్‌లో సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
భారత దేశ 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో ఇండియా డే పరేడ్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్, రష్మిక ఒకరిచేయి ఒకరు పట్టుకొని నడుస్తూ కనిపించారు. గత కొన్నేళ్లుగా ఇద్దరి మధ్య రిలేషన్ ఉంని వార్తలు, అఫీషియల్ లీక్‌లు వస్తున్నా ఎక్కడా ఇప్పటిలా కలసి చేయి చేయి పట్టుకుని కనిపించింది లేదు. దీంతో ఈ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతునర్నాయి.
‘గీత గోవిందం’ సినిమాలో నటించి మంచి ఆన్‌స్క్రీన్ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన.. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో కలసి పని చేశారు. ఆన్‌స్క్రీన్ కపుల్‌గా ఆ తర్వాత ఆశించిన విజయాలు దక్కకపోయినా.. ఆఫ్‌స్క్రీన్ కపుల్‌గా మంచి బజ్ సంపాదించుకున్నారు. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో ఓ పీరియాడిక్ యాక్షన్ సినిమాఓల విజయ్ దేవరకొండ నటిస్తున్నాడు. ఈ సినిమాలో రష్మిక మందననే కథానాయిక అని సమాచారం.
ఇక ఈ పరేడ్ విషయానికొస్తే.. గతేడాది బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా, 2023లో జాక్వెలైన్ ఫెర్నాండేజ్, సమంత.. 2022లో అల్లు అర్జున్, 2019లో సునీల్ శెట్టి, 2018లో కమల్ హాసన్, 2017లో రానా దగ్గబాటి హాజరయ్యారు. అంతకుముందు చాలామంది సెలబ్రిటీలు హాజరయ్యారు. ఓ కపుల్ హాజరవ్వడం మాత్రం ఇటీవ కాలంలో ఇదే తొలిసారి..