Prabhas: వైరల్ అవుతున్న చినజీయర్ స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు!

ప్రభాస్ రాముని పాత్రలో కృతిసనన్ సీత పాత్రలో తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ విడుదలకు ఇంకా 8 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రముఖ అధ్యాత్మిక గురువు చినజీయర్ స్వామి మాట్లాడుతూ ప్రతి వ్యక్తిలోనూ రాముడు ఉన్నాడని ప్రతి గుండెలోనూ రాముడు ఉన్నాడని మనందరిలో ఉన్న రాముడిని బయటకు తీసుకురావడానికి ప్రభాస్ ఈ సినిమా చేశాడని ఆయన కామెంట్లు చేశారు. ఈ సినిమా ద్వారా ప్రభాస్ లోకానికి ఉపకారం చేస్తున్నాడని చినజీయర్ స్వామి పేర్కొన్నారు.

నిజమైన బాహుబలి రాముడేనని నిరూపించడానికి ఈ సినిమా తీశారని అందువల్లే మేము ఈ వేడుకకు వచ్చామని ఆయన చెప్పుకొచ్చారు. మానవ జాతికి మంచి మార్గం చూపించిన మహనీయుడు శ్రీరాముడు అని ఈ మట్టి మీద నడిచి శ్రీరాముడు ఈ మట్టిని పావనం చేశాడని చినజీయర్ స్వామి చెప్పుకొచ్చారు. అరణ్య కాండ, యుద్ధకాండలోని ప్రధానమైన కథను చరిత్రగా లోకానికి అందించాలని ఈ సినిమా తీశామని దర్శకుడు చెప్పారని ఆయన తెలిపారు.

ఇంతకు మించి లోకానికి మహోపకారం మరొకటి ఉండదని చినజీయర్ స్వామి పేర్కొన్నారు. ఈ తరానికి తగ్గ టెక్నాలజీతో చేసిన సినిమా ఆదిపురుష్ అని ఆయన అన్నారు. యువతీ యువకులకు ఆదర్శంగా నిలిచేలా ఈ సినిమాను నిర్మించారని ఇలాంటి గొప్ప సినిమాను నిర్మించినందుకు బృందాన్ని అభినందిస్తున్నానని వైవీ సుబ్బారెడ్డి కామెంట్లు చేశారు. ప్రభాస్ మాట్లాడుతూ అభిమానులే నా బలమని ఏడాదికి రెండు సినిమాలు చేస్తానని వెల్లడించారు.

ఆదిపురుష్ సినిమాకు తొలినాళ్ల నుంచి కష్టాలు వచ్చాయని ఒక్క పోస్టర్ తోనే కృతిసనన్ ప్రేక్షకుల మనస్సులను గెలుచుకుందని ఆయన పేర్కొన్నారు. తక్కువ మాట్లాడి ఎక్కువ సినిమాలు చేస్తానని పెళ్లి ఎప్పుడైనా తిరుపతిలో చేసుకుంటానని ఆయన చెప్పుకొచ్చారు. (Prabhas) ప్రభాస్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus