టాలెంటెడ్ ప్రేక్షకులు లవర్ బాయ్ గా పిలుచుకునే సిద్ధార్థ్ సరికొత్త పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘చిన్నా’. ఎమోషనల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాని ఎటాకి సంస్థ నిర్మించింది. ఏషియన్ సినిమాస్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కాబోతుంది ఈ మూవీ. చిన్నాన్నకి, అతని అన్నయ్య కూతురుకి మధ్య ఉన్న అందమైన అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ఎస్.యు.అరుణ్‌కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. తమిళంలో `పన్నయారుం పద్మినియుం`, `సేతుపతి` సినిమాలతో డైరక్టర్‌గా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు అతను.
తెలుగులో ఈ చిత్రం పై బజ్ అయితే ఉంది. కానీ బిజినెస్ పెద్దగా జరగలేదు. ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :
నైజాం | 1.00 cr |
సీడెడ్ | 0.25 cr |
ఉత్తరాంధ్ర | 0.80 cr |
ఈస్ట్ | 2.05 cr |
‘చిన్నా’ (Chinna) చిత్రానికి తెలుగులో రూ.2.05 థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.2.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. సిద్దార్థ్ సినిమాలు ఈ మధ్య కాలంలో తెలుగులో బాగా ఆడినవి అంటూ ఏమీ లేవు.
కానీ ఈ సినిమాపై అతను చాలా ఆశలు పెట్టుకున్నాడు. 30 ఏళ్లలో ఇలాంటి సినిమా చేయలేదు అని ధీమాగా చెబుతున్నాడు. అతను ఎంత చెప్పినప్పటికీ పాజిటివ్ టాక్ వస్తేనే ఈ సినిమా నిలబడుతుంది. లేదంటే కష్టమనే చెప్పాలి. మరి తెలుగులో ‘చిన్నా’ ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.
మ్యాడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
మామా మశ్చీంద్ర సినిమా రివ్యూ & రేటింగ్!