Chinna Collections: ‘చిన్నా’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

టాలెంటెడ్ హీరో, ప్రేక్షకులు లవర్ బాయ్ గా పిలుచుకునే సిద్ధార్థ్ సరికొత్త పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘చిన్నా’. ఎమోషనల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాని ‘ఎటాకి’ సంస్థ నిర్మించింది. ‘ఏషియ‌న్ సినిమాస్’ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయడం జరిగింది. చిన్నాన్నకి, అతని అన్నయ్య కూతురుకి మ‌ధ్య ఉన్న అంద‌మైన అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ఎస్‌.యు.అరుణ్‌కుమార్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. త‌మిళంలో `ప‌న్న‌యారుం ప‌ద్మినియుం`, `సేతుప‌తి` సినిమాల‌తో డైర‌క్ట‌ర్‌గా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు అతను.

ఇక 2023 అక్టోబర్ 6న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ కలెక్షన్స్ అయితే ఆ స్థాయిలో రాలేదు. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.28 cr
సీడెడ్ 0.12 cr
ఉత్తరాంధ్ర 0.21 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 0.61 cr

‘చిన్నా’ (Chinna) చిత్రానికి తెలుగులో రూ.2.05 థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.2.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫైనల్ గా కేవలం రూ.0.61 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి..తెలుగులో కమర్షియల్ ఫెయిల్యూర్ గా నిలిచింది ఈ సినిమా. అయితే ‘చిన్నా’ సినిమాతో మళ్ళీ సిద్దార్థ్ సినిమాలపై తెలుగు ప్రేక్షకుల ఫోకస్ పడిందనే చెప్పాలి. నెక్స్ట్ సినిమాకి ఇలాగే పాజిటివ్ టాక్ వస్తే మంచి ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంది.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus