Chirajneevi: ‘వీరయ్య’ కోసం చిరంజీవి సుమ షోకి వచ్చారా?

టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు, టాలీవుడ్‌ స్టార్‌ హీరోల సినిమాల ప్రమోషన్‌ అంటే ఇంటర్వ్యూలు, ప్రెస్‌మీట్లు, సోషల్‌ మీడియాలో పోస్టులు మాత్రమే జరుగుతుండేవి. ఇటీవల కాలంలో ఈ విషయంలో మార్పులు వస్తున్నాయి. ఇంటర్వ్యూలు మీడియాకు ఇవ్వడం మానేసి వాళ్లకు వాళ్లే చేసుకుని ఆ వీడియో ఇస్తున్నారు. ఇలాంటి సమయంలో ఓ అగ్ర హీరో ఓ రియాలిటీ షోకి వచ్చారు అంటే పెద్ద విషయమే కదా. అదే జరిగింది అంటున్నారు. ఇదేంటి బాలీవుడ్‌ స్టైలా అని అనుకుంటున్నారా? అవును ఇంచుమించు అలాంటిదే.

సంక్రాంతి సినిమాల ప్రమోషన్లు మొదలయ్యాయి. దీంతో ఉన్న అన్ని రకాల అవకాశాలను వాడేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్‌ చిరంజీవి ఓ డిఫరెంట్‌ ఫీట్‌ చేశారు అని చెబుతున్నారు. ఈ విషయంలో స్పష్టత అయితే లేదు కానీ.. కచ్చితంగా నిజమే అనే మాటలు మాత్రం వినిపిస్తున్నాయి. సుమ కనకాల వ్యాఖ్యాతగా ఈటీవీలో ఓ కొత్త ప్రోగ్రాం మొదలైంది. ‘సుమ అడ్డా’ పేరుతో తొలి ఎపిసోడ్‌ ప్రోమో కూడా వచ్చేసింది కూడా. ఆ షో గురించి ఇదంతా.

అంటే ‘సుమ అడ్డా’ షోకి చిరంఈజవి వచ్చారా? అని ఆశ్చర్యపోతూ ఓ ప్రశ్న వేయబోతున్నారా? ఆగండాగండి మేమేం చెప్పేస్తున్నాం. అవును మీరు అనుకుంటున్నది కరెక్టే. ఆ షోకి చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ టీమ్‌ వచ్చిందని టాక్‌. షో రెండో ఎపిసోడ్‌ వాళ్ల మీదే ఉండబోతోందట. చిరంజీవి, డైరక్టర్ బాబీ ఈ ఎపిసోడ్‌కి హాజరు కావడం విశేషం. బాబి సంగతి సరే, మెగాస్టార్ ఒక టీవీ గేమ్ షో రావడం కచ్చితంగా విశేషమే.

ఇక చిరంజీవి ఇటీవల కాలంలో టవీ షోలు అంటే.. గతంలో ఆహా ఓటీటీలో సమంత చాట్ షో ‘సామ్‌ జామ్‌’కి హాజరయ్యారు. ఇప్పుడు సుమ కోసం మళ్లీ వచ్చారు అని చెబుతున్నారు. అయితే ఈ షో నిర్మాత అయిన మల్లెమాల శ్యామ్‌ప్రసాద్‌ రెడ్డి వల్లనే చిరంజీవి షోకి వచ్చారు అని టాక్‌ నడుస్తోంది. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉండటంతో షోకి చిరు వచ్చారు అంటున్నారు. అన్నట్లు సుమను తరచుగా చిరంజీవి పొగడ్తలతో ముంచెత్తుతుంటారు. అది కూడా ఓ కారణం కావొచ్చు.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus