విజయశాంతి వ్యాఖ్యలు చిరంజీవిని అంతగా హర్ట్ చేశాయా..!

సరిలేరు నీకెవ్వరు ప్రీరిలీజ్ ఈవెంట్ వేదికగా చిరంజీవి, విజయశాంతి ల మధ్య జరిగిన ఎపిసోడ్ ఈవెంట్ కే హైలెట్ గా నిలిచింది. సరిలేరు నీకెవ్వరు చిత్ర హీరో మహేష్, దర్శకుడు అనిల్ రావిపూడితో పాటు చిత్ర యూనిట్ సభ్యులందరికీ బెస్ట్ విశెష్ చెప్పిన చిరంజీవి ప్రత్యేకంగా విజయ శాంతి గురించి తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. నాతో ఇరవై సినిమాలు చేసిన నా హీరోయిన్ విజయశాంతి నన్ను వదిలివెళ్ళిపోయి 15ఏళ్ళు అవుతుంది అన్నారు. ఆమెతో చేసిన సినిమాలు…సాంగ్స్ గుర్తుకొస్తుంటే మనసు ఆరోజుల లోకి వెళ్ళిపోతుంది అన్నారు. విజయశాంతి కేవలం నాతో నటించిన హీరోయిన్ కాదు, ఆమె ఒక కుటుంబ సభ్యురాలిగా ఉండేవారు అన్నారు . చెన్నై టి నగర్ లో మా ఇద్దరి ఇళ్ళు ఎదురెదురుగా ఉండేవి. ఏ చిన్న వేడుక జరిగినా ఒకరినొకరు పిలుచుకొని పాల్గొనేవాళ్ళం అన్నారు.

ఐతే ప్రసంగం మధ్యలో ఆయన అసలు విషయం బయటపెట్టారు. ఇంతగా నిన్ను అభిమానించే నన్ను అంతటి మాటలు అనాలని నీకు ఎలా అనిపించింది అని వేదిక సాక్షిగా సూటిగా విజయశాంతిని చిరంజీవి అడిగారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు విజయశాంతి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఆ సమయంలో చిరంజీవిపై విజయశాంతి తీవ్రమైన రాజకీయ విమర్శలు చేశారు. అదే విషయాన్ని గుర్తు చేస్తూ విజయశాంతిని వేదికపై చిరు ప్రశ్నించారు. అంతమంది సమక్షంలో చిరు ఆమెను అలా ప్రశ్నించే సరికి కొంచెం ఇబ్బందికి గురయ్యారు. ఐతే చిరంజీవి పై ఆమె చేసిన వ్యాఖ్యలు ఆయనను తీవ్రంగా కలిచివేశాయని మాత్రం అర్థం అయ్యింది.

నువ్వు అన్ని మాటలు అన్నా నేను ఒక్క మాటైనా నిన్ను తిరిగి అన్నానా..? అని చిరు విజయ శాంతిని అమాయకంగా అడగడం ఆసక్తిని రేపింది. ఆమాటకు విజయ శాంతి ముందు అనకపోయిన వెనుక అని ఉంటారు అని చమత్కరించింది. దానికి చిరు ప్రమాణ పూర్తిగా నేను నిన్ను నిందించలేదు.. నాకు మనసు రాదు అని చెప్పారు. ఎట్టకేలకు రాజకీయం వేరు, సినిమా వేరు..మీరు ఎప్పటికీ నా హీరోనే..నేను ఎప్పటికీ మీ హీరోయిన్ నే అని విజయశాంతి ఆ చర్చకు ముగింపు పలికారు. ఏదిఏమైనా సరిలేరు నీకెవ్వరు ప్రీరిలీజ్ ఈవెంట్ వేదికగా జరిగిన ఈ ఎపిసోడ్ అటు వైదికపై ఉన్న ప్రముఖులకు..ఇటు అభిమానులకు ఆహ్లాదం పంచింది.

అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus