స్టార్ హీరో చిరంజీవి ఆచార్య సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. 43 సంవత్సరాల సినీ జీవితంలో చిరంజీవి నటుడిగా ఎన్నో ఘనవిజయాలను సొంతం చేసుకున్నారు. ఆరు పదుల వయస్సులో కూడా యాక్టివ్ గా ఉంటూ వరుస సినిమాల్లో నటిస్తూ చిరంజీవి నటుడిగా సత్తా చాటుతున్నారు. ఆచార్య సినిమా హిందీ డబ్బింగ్ హక్కులు ఏకంగా 26 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి.
తెలుగు సినిమాల డబ్బింగ్ హక్కుల విషయంలో ఆచార్య సినిమా టాప్ లో ఉంది. మల్టీస్టారర్ సినిమా కావడం, వరుస విజయాలతో ఉన్న కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటంతో ఈ రేటు పలికిందని తెలుస్తోంది. పవన్ రానా కలిసి నటిస్తున్న అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ హక్కులు 23 కోట్ల రూపాయలకు అమ్ముడవగా ఆ సినిమాను మించి చిరంజీవి మూవీ హక్కులు అమ్ముడయ్యాయి. మరోవైపు ఆచార్య రిలీజ్ డేట్ గురించి అనేక వార్తలు వైరల్ అవుతుండగా చిత్రయూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
అయితే ఆచార్య సినిమా హిందీ డబ్బింగ్ హక్కుల రికార్డులను త్వరలోనే ఆర్ఆర్ఆర్ బ్రేక్ చేసే అవకాశం ఉంది. ఈ రెండు సినిమాల్లోనూ రామ్ చరణ్ నటిస్తుండటం గమనార్హం. రామ్ చరణ్ వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆచార్య కలెక్షన్లపరంగా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది.
Most Recommended Video
నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!