Chiranjeevi, Anil Ravipudi: చిరు – అనిల్.. అప్పుడే టార్గెట్ కూడా సెట్టయ్యింది!

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)  ప్రస్తుతం విశ్వంభర (Vishwambhara) చిత్రంతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. వశిష్ట (Mallidi Vasishta) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది. తొలుత ఈ సినిమాను 2025 సంక్రాంతికి విడుదల చేయాలని భావించినా, షూటింగ్ షెడ్యూల్ ఆలస్యంతో సమ్మర్‌కు వాయిదా పడింది. విశ్వంభర చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే విశ్వంభర తరువాత చిరంజీవి అనిల్ రావిపూడితో చేయబోయే ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.

Chiranjeevi, Anil Ravipudi

ఈ కాంబినేషన్‌లో ఫుల్ లెంగ్త్ కామెడీ మాస్ సినిమా ఎంటర్‌టైనర్ రెడీ అవుతోందని సమాచారం. ఇప్పటికే అనిల్ స్క్రిప్ట్‌ను ఫైనల్ చేసి చిరంజీవి ఆమోదం పొందారు. జనవరి 15న సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాకు పూజా కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్లు టాక్. జులై నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని తెలుస్తోంది. అనిల్ రావిపూడి తన సినిమాలను సంక్రాంతికి విడుదల చేయడంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. ఈ సినిమా కూడా 2026 సంక్రాంతిని టార్గెట్ చేసుకుని రూపొందిస్తున్నట్లు సమాచారం.

అనిల్ గతంలో చేసిన ఎఫ్ 2 (F2 Movie), ఎఫ్ 3 (F3 Movie)  సినిమాలు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు చిరంజీవితో కూడా అదే తరహా స్క్రిప్ట్‌ను ప్లాన్ చేసినట్లు సమాచారం. చిరంజీవి గతంలో అనిల్ డైరెక్షన్‌పై ప్రశంసలు కురిపించారు. ఆయనతో పనిచేయడం తనకు సంతోషంగా ఉందని తెలిపిన చిరు, కొత్త కథపై పూర్తి స్థాయిలో ఆసక్తి చూపిస్తున్నారు. మూడు నుంచి నాలుగు నెలల్లోనే సినిమా పూర్తిచేయడానికి అనిల్ తన ప్రత్యేక స్టైల్‌లో షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

2026 సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. మెగా ఫ్యాన్స్ ఇప్పటికే ఈ కాంబినేషన్‌పై ఉత్సాహంగా ఉన్నారు. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు, చిరంజీవి-అనిల్ కాంబో మరింత హైప్‌ను సొంతం చేసుకోవడం ఖాయమని ట్రేడ్ అనలిస్ట్‌లు భావిస్తున్నారు.

‘జై హనుమాన్’ మేకర్స్ పై కేసు… ఏమైందంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus