దిల్ రాజుతో రావిపూడి ఫైట్.. ఫస్ట్ టైమ్ ఇలా..!

Ad not loaded.

సంక్రాంతి ఫెస్టివల్ అంటేనే బాక్సాఫీస్‌కి పండగ. ఎప్పుడూ పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ హవా కొనసాగే ఈ సీజన్‌లో టాలీవుడ్ స్టార్ నిర్మాత దిల్ రాజు నెక్స్ట్ పొంగక్ కు ఓ కాంప్లిట్ ఫ్యామిలీ సినిమాతో ప్లాన్ చేస్తున్నాడు. అదే టైమ్‌లో అనిల్ రావిపూడి (Anil Ravipudi) తన కొత్త ప్రాజెక్ట్‌ని కూడా విడుదల చేయబోతున్నాడు. అయితే ఈసారి ఇద్దరూ అదే ఫ్రేమ్‌లో కాకుండా, ఒకరికొకరు పోటీగా నిలవబోతున్నారంటే ఆసక్తికరంగా మారింది. అనిల్ రావిపూడి ఇంతకు ముందు దిల్ రాజుతో  (Dil Raju) వరుసగా సినిమాలు చేసాడు.

Chiranjeevi 

పటాస్ (Pataas) తరువాత వచ్చిన సుప్రీమ్ (Supreme), రాజా ది గ్రేట్ (Raja the Great), సరిలేరు నీకెవ్వరు (Sarileru Neekevvaru), ఎఫ్ 2 (F2 Movie), ఎఫ్ 3 (F3 Movie) అన్నీ దిల్ రాజు బ్యానర్‌లోనే వచ్చాయి. రీజంట్ గా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam) సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ అనిల్ ఈసారి చిరంజీవితో (Chiranjeevi) చేసే సినిమాకు మాత్రం వేరే నిర్మాతలను ఎంచుకున్నాడు. ఈ మూవీకి సాహు గారపాటి(Sahu Garapati) , కొణిదెల సుష్మిత (Sushmita Konidela)  నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మెగాస్టార్‌తో అనిల్ రావిపూడి మాస్, కామెడీ, ఎమోషన్ మిక్స్‌చేసిన ఓ భారీ ఎంటర్‌టైనర్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

దిల్ రాజు మాత్రం తను మళ్లీ ఫ్యామిలీ ఆడియెన్స్‌ను టార్గెట్ చేసేలా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాను ఆయన శతమానం భవతి (Shatamanam Bhavati) సినిమా సీక్వెల్ లా రూపొందించబోతున్నారని టాక్. శతమానం భవతి 2017 సంక్రాంతికి రిలీజ్ అయ్యి బిగ్ బ్లాక్‌బస్టర్ అయ్యింది. గ్రామీణ కథ, కుటుంబ బంధాలను హైలైట్ చేస్తూ, ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ సినిమా తర్వాత మరోసారి అదే సెంటిమెంట్‌ని తీసుకురావాలని భావిస్తున్నారు. అయితే, ఈ సీక్వెల్‌ను ఒరిజినల్ డైరెక్టర్ సతీష్ వేగేశ్న (Satish Vegesna) తోనే చేయిస్తారా లేక వేరే దర్శకుడిని తీసుకురతారా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.

ఇక చిరంజీవి (Chiranjeevi) – అనిల్ రావిపూడి మూవీ పూర్తిగా మాస్, కామెడీ, ఎమోషన్ మిక్స్‌గా ఉండబోతుంది. ఈసారి అనిల్ తన మేకింగ్‌ని పూర్తిగా మెగా రేంజ్‌లో ప్రూవ్ చేసుకోవడానికి భారీగా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. అయితే దిల్ రాజు మాత్రం ఫ్యామిలీ ఆడియెన్స్‌తో మరోసారి బిగ్ హిట్ కొట్టేందుకు ట్రై చేస్తున్నాడు. ఒకవైపు మెగాస్టార్ (Chiranjeevi) మాస్ సినిమా, మరోవైపు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అంటూ 2026 సంక్రాంతి బరిలో క్లాష్ పక్కాగా ఫిక్స్ అయ్యింది. మరి ఈ పోటీలో ఎవరి సినిమా విజయం సాధిస్తుందో, ఎవరి సినిమా సంక్రాంతి హిట్‌గా నిలుస్తుందో చూడాలి.

ఫౌజీ కోసం లెజెండరీ యాక్టర్ అనుపమ్ ఖేర్!.. ప్రభాస్ ఆర్మీ లుక్ ఇదే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus